గేమ్ ఛేంజర్‌ ఆ రెండు ట్విస్ట్‌లే హైలెట్ .. మెగా అభిమానులకు పండగే..!

Amruth kumar
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్‌ డైరెక్టర్ శంకర్ తెర్కక్కించిన గేమ్ ఛేంజర్ మూవీ జనవరి 10న ప్రేక్షకుల‌ ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే .. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా వస్తున్న ఈ సినిమా పైన నిర్మాత దిల్ రాజు ఎంతో నమ్మకంతో ఉన్నారు .. ఇక ఈ సినిమాతో తిరిగి తాను మళ్ళీ ఫామ్ లోకి వస్తానని ఆయన భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ , సాంగ్స్ అన్నీ కూడా సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయని చెప్పాలి. శంకర్ గతంలో తెరకెక్కించిన ఒకే ఒక్కడు , జెంటిల్మెన్ సినిమాల తరహాలో సోషల్ పొలిటికల్ డ్రామాగా ఈ మూవీ కథ‌ని సిల్వర్ స్కిన్ పై చూపించబోతున్నట్లు తెలుస్తుంది .. శంకర్ మార్క్ ఎలివేషన్ ప్రజెంటేషన్ ట్రైలర్లు కనిపించింది .. ఈ క్రమంలోనే మెగా అభిమానులు కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు .. కచ్చితంగా రామ్ చరణ్ ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంటారని అంటున్నారు.

అయితే ఇప్పుడు ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .. ఈ సినిమాలో రెండు ప్రధానమైన ట్వీస్ట్ లు ఉంటాయట .. అందులో ఇంటర్వెల్ ముందు ఒక యాక్షన్ బ్లాక్ నుంచి వచ్చే ట్విస్ట్ సెకండ్ ఆఫ్ పై మరింత అంచనాలు పెంచుతుందని టాక్ .. అలాగే సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్లో అప్పన్న క్యారెక్టర్ పొలిటికల్ ట్వీస్ట్‌ కూడా సినిమాకి మరింత ఎలివేషన్ ఇస్తుందనే మాట కూడా గట్టిగా వినిపిస్తుంది. ఈ రెండు ఎలిమెంట్స్‌ సినిమాల్లో ప్రేక్షకులని కచ్చితంగా ఎట్రాక్ట్ చేసి సినిమాపై ఇంట్రెస్ట్ పనిచేలా చేస్తాయని అంటున్నారు .. అలాగే ఈ సినిమాలోని జరగండి సాంగ్ గురించి కూడా ప్రత్యేకంగా చర్చ నడుస్తుంది .. ఇందులో శంకర్ పిచ్చరైజేషన్ చాలా అద్భుతంగా ఉంటుందని టాక్ నడుస్తుంది . అలాగే సాంగ్స్ అన్నీ కూడా చాలా కొత్తగా ఉంటాయని కూడా అంటున్నారు .. కేవలం సాంగ్స్ కోసమే సుమారు 80 కోట్ల వరకు ఖర్చు చేశారట.

ఇక రామ్ చరణ్ - అంజలి అవార్డు విన్నింగ్ పర్ఫామెన్స్ తో ప్రేక్షకులకు సినిమాపై మరింత ఆసక్తి పెంచుతారని అలాగే అంజలి పాత్రకి సంబంధించిన అదిరిపోయే ట్వీస్ట్‌ కూడా ఉంటుందని ఇప్పటికే శంకర్ కూడా చెప్పారు .. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌ అంతా కూడా మూవీని  మరో లెవ‌ల్‌ లోకి తీసుకు వెళుతుందని అభిప్రాయం అందరిలో కనిపిస్తుందింది .. ఇలా మొత్తంగా రామ్ చరణ్ కెరీర్ లోనే ఇది బెస్ట్ సినిమా అవుతుందని అభిమానులు బలంగా నమ్ముతున్నారు .. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కు జంటగా కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది .. అలాగే ఎస్‌జె సూర్య ఈ సినిమాలో విలన్ గా నటించారు. రామ్ చరణ్ , ఎస్‌జె సూర్యమధ్య ఫైట్ చాలా ఆసక్తికరంగా ఉంటుందని అంటున్నారు .. ఇక ఫైనల్ గా ఈ సినిమా అవుట్ పుట్ ఎలా ఉంటుందో తెలియాలంటే 10 తారీకు వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: