ఆ విషయంలో మన కంటే పాక్ బెటర్.. ఒప్పుకున్న ఆర్మీ చీఫ్ జనరల్?
రాకెట్ ఫోర్స్ ఏర్పాటు చేసి దాన్ని బలోపేతం చేయడం ద్వారా దేశ భద్రతను మరింత బలపరచాలని జనరల్ ద్వివేది సూచించారు. ఈ వ్యాఖ్యలు రక్షణ రంగంలో దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను బహిర్గతం చేశాయి.ఆపరేషన్ సిందూర్ తర్వాత సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాద ఘటనలు గణనీయంగా తగ్గాయని ఆర్మీ చీఫ్ తెలిపారు.
అయితే పాకిస్తాన్లో ఇంకా ఎనిమిది ఉగ్ర శిబిరాలు చురుగ్గా పనిచేస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆ శిబిరాల్లో దాదాపు 150 మంది ఉగ్రవాదులు ఉండవచ్చని అంచనా వేశారు. భారతదేశంపై దాడులకు పాకిస్తాన్ ఇంకా సహకరిస్తోందని జనరల్ ద్వివేది ఆరోపించారు. గూఢచార డ్రోన్ల ద్వారా భారత సరిహద్దుల్లోకి పాకిస్తాన్ ప్రవేశిస్తోందని ఆయన వెల్లడించారు.
ఈ విషయాలు భారత రక్షణ వ్యూహాల్లో రాకెట్ సామర్థ్యం పెంచడం ఎంత ముఖ్యమో సూచిస్తున్నాయి. ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు దేశ భద్రతా సంస్థల్లో చర్చను రేపుతున్నాయి.రాకెట్ ఫోర్స్ ఏర్పాటు భారత సైన్యం యుద్ధ వ్యూహాల్లో మరింత బలాన్నిచ్చే అవకాశం కలిగి ఉంది. పాకిస్తాన్ చైనా రెండూ ఈ రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. భారతదేశం ఈ విషయంలో వెనుకబడటం జాతీయ భద్రతకు సవాలుగా మారింది.
9490520108.. ఈ వాట్సాప్ నెంబర్కు మీ నియోజకవర్గాల్లో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. రెండు రాష్ట్రాల్లో నియోజకవర్గాల వారీగా సమస్యలు, ఎమ్మెల్యేల పనితీరు, వారు ఇచ్చిన హామీలు, ప్రజల ఇబ్బందులు, అక్కడ అధికార, ప్రతిపక్ష పార్టీల పరిస్థితులు, రాజకీయ అంశాలపై కూడా మీ అభిప్రాయం మాతో పంచుకోండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.