మన శంకరవరప్రసాద్ గారు చిత్రంలో చిరంజీవి కొడుకుగా ఎవరు నటించారో తెలుసా..?

Divya
మెగాస్టార్ చిరంజీవి , అనిల్ రావిపూడి కాంబినేషన్లో (జనవరి 12) సంక్రాంతికి వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం మన శంకరవరప్రసాద్ గారు. మొదటి షో తోనే హిట్ టాకుతో సొంతం చేసుకొని మొదటి రోజే ఏకంగా రూ.84 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. చిరంజీవికి జోడిగా నయనతార నటించగా ,వెంకటేష్ గెస్ట్ పాత్రలో నటించారు. అయితే ఈ సినిమాలో చిరంజీవికి పిల్లలుగా ఇద్దరు చిన్నారులు నటించారు. ఇందులో కుమారుడు విక్కీ పాత్ర అందరిని కూడా ఆకట్టుకుంటుంది.



మన శంకరవరప్రసాద్ సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమంలో విక్కీ పాత్రకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని డైరెక్టర్ అనిల్ రావిపూడి తెలియజేశారు. అదేమిటంటే విక్కీ పాత్రలో కనిపించింది అబ్బాయి కాదు అమ్మాయి అని. ఆ అమ్మాయి పేరు ఊహ అంటూ ఈ విషయాన్ని డైరెక్టర్ స్వయంగా తెలియజేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అబ్బాయి పాత్రలో ఊహ కూడా అద్భుతంగా నటించిందని సాధారణంగా అమ్మాయిలకు జుట్టు అంటే చాలా ఇష్టం, అయితే ఈ పాత్ర కోసం ఊహ తన జుట్టుని కూడా కత్తిరించుకొని మరి ఈ చిత్రంలో నటించిందని తెలిపారు. ఈ విషయం పైన డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా ప్రశంసలు కురిపించారు చిన్నారి ఊహా పైన. ఈ విషయం తెలిసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.


అలాగే సినిమా సక్సెస్ మీట్ లో కూడా ఎన్నో విషయాలను తెలియజేశారు అనిల్ రావిపూడి ముఖ్యంగా సినిమా స్టోరీ రాయడానికి కేవలం తనకి 25 రోజుల సమయం మాత్రమే పట్టిందని తెలియజేశారు. కేవలం చిరంజీవి ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని తన పాత సినిమాల స్టైల్ ని ఈ సినిమాలో కొంచెం మిక్స్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చానని, ప్రస్తుతం ఉన్న జనరేషన్ కి చిరంజీవి గురించి తెలిసేలా చేశానంటూ తెలియజేశారు. మొత్తానికి మెగాస్టార్ చిరంజీవికి సక్సెస్ ఇవ్వడంతో అభిమానులు కూడా ఖుషీ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: