పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు నటిస్తున్న చిత్తాలలో "ది రాజా సాబ్" సినిమా ఒకటి. ఈ సినిమాకు దర్శకుడు మారుతి దర్శకత్వం వహించగా అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటివరకు కేవలం చిన్న చిత్రాలని తీసిన మారుతీ ఏకంగా ప్రభాస్ తో కలిసి పాన్ ఇండియా సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో ముఖ్యంగా ప్రభాస్ ను ఇదివరకు చూడని విధంగా హార్రర్ కామెడీ జోనర్లలో చూడబోతున్నాము.
ఈ విషయం తెలిసి ప్రభాస్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ది రాజా సాబ్ సినిమా 2025 ఏప్రిల్, 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుందని అంటున్నారు. ది రాజా సాబ్ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్లుగా ముగ్గురు ముద్దుగుమ్మలు నటిస్తున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ధి కుమార్లు హీరోయిన్లుగా చేస్తున్నారు.
ఈ ముగ్గురు హీరోయిన్లతో పాటు లేడీ సూపర్ స్టార్ నయనతార ది రాజా సాబ్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయబోతుందని వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ తో ఉన్న స్నేహం కారణంగానే నయనతార స్పెషల్ సాంగ్ చేయడానికి ఒప్పుకుందట. కాగా, ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ అప్డేట్ వచ్చింది. ది రాజా సాబ్ సినిమా ఏప్రిల్ 10వ తేదీన విడుదల అవుతుందని చిత్ర బృందం నుంచి గతంలో అధికారిక ప్రకటన వచ్చింది.
అయితే అదే తేదీన అజిత్ హీరోగా నటించిన "గుడ్ బ్యాడ్ అగ్లీ" సినిమా విడుదల అవుతుందట. ఇక తెలుగులో చిరంజీవి నటించిన "విశ్వంభర" సినిమా ఏప్రిల్ 10వ తేదీన రిలీజ్ కానుంది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన "జాక్" సినిమా కూడా ఏప్రిల్ 10వ తేదీన విడుదల అవుతుందని సినీ వర్గాలు వెల్లడించాయి దీంతో ది రాజా సాబ్ సినిమా విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్లుగా ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ విషయం తెలిసి ప్రభాస్ అభిమానులు కాస్త నిరాశకు లోనవుతున్నారు.