విశాల్ బ్రెయిన్ లో డ్యామేజ్.. అందుకే అర్జున్ రెడ్డి హీరోయిన్ తో పెళ్లి క్యాన్సలా..?

Pandrala Sravanthi
తమిళ నటుడు విశాల్ ని చూస్తే ఈ మధ్యకాలంలో చాలా మంది భయపడిపోతున్నారు. ఎందుకంటే ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా దారుణంగా ఉంది. తాజాగా మదగదరాజా సినిమా ప్రమోషన్స్ లో ఆయన పాల్గొన్న సమయంలో విశాల్ వణుకుతూ మాట్లాడడం,కనీసం నిలబడలేకపోవడం,ఆయన ఫేస్ మొత్తం పేలవంగా మారిపోవడం వంటిది మనం గమనించాం. అయితే ఆయన హై ఫీవర్ తో బాధపడుతున్నారని కొంతమంది అనుకున్నారు.కానీ విశాల్ హెల్త్ పై తాజాగా కుటుంబ సభ్యులు షాకింగ్ విషయాలను బయటపెట్టారు. మరి వాళ్ళు చెప్పిన విషయాలు ఏంటో చూద్దాం. తమిళనాడులో రజనీకాంత్, కమల్ హాసన్ వంటి హీరోల తర్వాత అత్యధిక ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో విశాల్ కూడా ఒకరు. ఈయన నడిఘర్ సంఘానికి అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. అయితే అలాంటి విశాల్ ఇప్పటికే ఎన్నో సినిమాలు చేసి నటుడిగా తనేంటో నిరూపించుకున్నాడు.

 అయితే అలాంటి విశాల్ ఆరోగ్యం గత కొద్ది రోజులుగా బాగా లేదని తెలుస్తోంది.రీసెంట్గా ఆయన 2013లో నటించి ఇప్పుడు విడుదలకు నోచుకున్న మదగద రాజు సినిమా ప్రమోషన్స్ లో నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ మైక్ లో మాట్లాడే సమయంలో చేతులు వణుకుతూ ఆయన ఫేస్ మొత్తం మారిపోయిన వీడియోలు మనం చూసాం. అయితే ఆయన హెల్త్ పై చాలా మందికి అనుమానాలు ఉన్నాయి.దాంతో హాస్పిటల్లో చెకింగ్ కి వెళ్ళిన సమయంలో విశాల్ బ్రెయిన్ లో ఉన్న నరాలు కాస్త డ్యామేజ్ అయ్యాయని డాక్టర్స్ చెప్పారట .ఇక ఈ బ్రెయిన్ లో నరాలు డ్యామేజ్ అవ్వడం వల్ల విశాల్ చిన్న విషయానికే ఎక్కువ ఒత్తిడికి గురవడం, విపరీతమైన తలనొప్పి వంటి ఇబ్బందులను ఫేస్ చేశారట.

అయితే దీనికి సంబంధించి విశాల్ ఫారిన్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే విశాల్ పూర్తి ఆరోగ్యంగా బయటపడతారని సమాచారం. అయితే తన ఆరోగ్యం బాగా లేకపోవడం వల్లే అర్జున్ రెడ్డి సినిమాలో సెకండ్ హీరోయిన్గా చేసిన అనీషా రెడ్డితో తన పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నట్టు విశాల్ కుటుంబ సభ్యులు తెలియజేశారు.అయితే అనీషా  రెడ్డి అనే నటితో విశాల్ కి ఎంగేజ్మెంట్ అయ్యింది.పెళ్లికి పది రోజులు ఉండగా పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నాడు విశాల్. తనకున్న హెల్త్ ఇష్యూస్ వల్ల తాను పెళ్లి చేసుకున్న అమ్మాయికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే విశాల్ ఈ పెళ్లి రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికి విశాల్ పూర్తి ఆరోగ్యంతో బయటపడాలని ఆ దేవున్ని కోరుకుందాం

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: