నేను సోనియా పెళ్లికి వెళ్లడానికి కారణం అదే.. లేకపోతే వెళ్లే దాన్ని కాదన్న బిగ్ బాస్ బ్యూటీ
ఇక తాజాగా ప్రేరణ కంబం ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో యాంకర్ సోనియా పెళ్లికి వెళ్లడం గురించి అడుగగా.. ప్రేరణ ఇలా చెప్పుకొచ్చింది. 'నాకు సోనియా అంటే ఎలాంటి కోపం లేదు. ఆ రోజు బిగ్ బాస్ హౌస్ లో అది ఒక ప్రక్రియ అందులో కచ్చితంగా ఎవరో ఒక్కరిని పెట్టాలి కాబట్టి.. నాకు సోనియాతో ఉన్న గొడవల కారణంగా నేను బయటికి వెళ్ళాక సోనియాని కలవాలి అనుకోవడం లేదు అని పెట్టాల్సి వచ్చింది. కానీ నేను జీవితాంతం సోనియాని కాలవను అని అనుకోలేదు. కానీ బిగ్ బాస్ హౌస్ నుంది బయటికి వచ్చాక నేను స్టేజ్ మీద సోనియాని ఇమిటేట్ చేశాను. సోనియాతో కూడా మాట్లాడను. తర్వాత తన పెళ్లి గురించి తెలిసింది. నేను అనుకున్న బిగ్ బాస్ లో అలా పెట్టాను కదా ఇప్పుడు వెళ్తే.. అందరూ అడుగుతారు, ఫేక్ గా ఉన్నవా అని అంటారని నేను శ్రీ పాద్ తో చెప్పాను.
కానీ నేను అలా చెప్పిన కూడా సోనియా, యష్ ఇద్దరు వచ్చి నన్ను పెళ్లికి రమ్మని పిలిచారు. అలాగే.. శ్రీ పాద్ ని, మా నాన్నని కూడా రమ్మని అన్నారు. తర్వాత ప్లీజ్ రా ప్రేరణ అని కూడా సోనియా నాకు మెసేజ్ చేసింది. ఇంకా ఇంట్లో వాళ్లు కూడా వచ్చి తాను చూసి కూడా పిలుస్తుంది.. వెళ్లి రా అని అన్నారు. అందుకే నేను, శ్రీ పాద్ ఇద్దరం కలిసి వెళ్లి వచ్చాం' అని ప్రేరణ చెప్పుకొచ్చింది.