రామ్ చరణ్: పవన్ కళ్యాణ్ నిజమైన గేమ్ ఛేంజర్..!

Divya
రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా జనవరి 10వ తేదీన రిలీజ్ కి సిద్ధమయ్యింది.. ఈ సందర్భంగా ఈ రోజున ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని చాలా గ్రాండ్గా రాజమండ్రిలో ప్లాన్ చేయడం జరిగింది. అందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా రావడం జరిగింది. బాబాయి, అబ్బాయి కలిసి రావడం ఎన్నికల తర్వాత మొదటిసారి ఇదే.. ఈవెంట్ కి చాలామంది అభిమానులు పెద్ద ఎత్తున వచ్చినట్లు తెలుస్తోంది దీంతో సినిమా పైన భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక రామ్ చరణ్ ఈవెంట్లో మాట్లాడుతూ.. మొదటిసారి ధవలేశ్వరం బ్రిడ్జి మీద పవన్ కళ్యాణ్ గారు ర్యాలీ చేస్తున్నప్పుడు చాలా మంది జనాలు వచ్చారు. ఇవాళ గేమ్ ఛేంజర్ ఈవెంట్ కి కూడా అంతే జనం వచ్చారు అంటూ తెలిపారు. శంకర్ గారు ఈ సినిమాకి ఎందుకు గేమ్ ఛేంజర్ టైటిల్ పెట్టారో తెలియదు కానీ రియల్ లైఫ్ లో మాత్రం ఇండియన్ పాలిటిక్స్ లో రియల్ గేమ్ ఛేంజర్  పవన్ కళ్యాణ్ గారి అంటూ తెలియజేశారు. ఆయన పక్కన ఇవాళ నిలబడినందుకు ఆయన కుటుంబంలో పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను అంటూ వెల్లడించారు.

మరి డైరెక్టర్ శంకర్ గారు పవన్ కళ్యాణ్ గారిని చూసే ఈ కథని రాసుకున్నారేమో తెలియదు..కానీ జనవరి 10వ తేదీన ఈ సినిమా గ్రాండ్గా థియేటర్లో రిలీజ్ కాబోతోంది అంటు తెలిపారు. దిల్ రాజు నిర్మాణంలో ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఎస్ జె సూర్య, అంజలి శ్రీకాంత్, సునీల్ ,కియారా తదితర నటీనటుల సైతం ఇందులో నటించారు. మొత్తానికి సినిమా ట్రైలర్ తో పాటు పాటలతో మంచి హైప్ పెంచుకున్నారు. మరి ఏ మేరకు సినిమా ఎలాంటి కలెక్షన్స్ ను రికార్డులను రాబడుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: