ప్రియుడుతో ఎంగేజ్మెంట్ చేసుకొని సడన్ షాక్ ఇచ్చిన అరుంధతి నటి..!
దీంతో సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ అభిమానులను సంపాదించుకుంది. ఈ క్రమంలోనే ఈ ముద్దుగుమ్మ తాజాగా ఒక పోస్టుని షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది.. అసలు విషయంలోకి వెళ్తే దివ్య నగేష్ తన ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక పోస్టుతో తన ప్రియుడితో కలిసి ఎంగేజ్మెంట్ జరిగిన ఫోటోలను షేర్ చేస్తూ అలాగే తమ బాండింగ్ గురించి కూడా ఎప్పటినుంచి మొదలయ్యింది అనే విషయాన్ని తెలియజేసింది దివ్య నగేష్.. అలాగే కొన్ని వంతెనలను దాటడం చాలా కష్టంగా ఉన్నప్పుడు మీరు నిశ్శబ్దంగా వాటి నుండి నడవడానికి నాకు సహాయం చేశారు అంటూ రాసుకుంది.
అలాగే తాను పూర్తిగా చీకటిలో ఉన్నప్పుడే మీరు తన జీవితానికి వెలుగు ఇచ్చారంటూ తెలియజేసింది దివ్య నగేష్.. ఇది ముగింపు నేను అనుకున్నప్పుడు మీరు కొత్త జీవితాన్ని ప్రారంభించేలా చేశారు.. చాలామంది కూడా మా బంధాన్ని నిర్ధారించారు, వ్యాఖ్యానించారు కానీ నా జీవితంలో నా కోసం మీరు ఏం చేశారు నాకు మాత్రమే తెలుసు అంటూ తెలియజేసింది.. అధికారికంగా మీ భార్య కావడానికి ఇంకా వేచి చూడలేను అంటూ ఆజీ అంటూ ఒక క్యాప్షన్ రాసుకొచ్చింది దివ్య నగేష్.. మొత్తానికి ఈ పోస్టుతో అటు అభిమానులను ఆకట్టుకోవడంతో ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు.