సంక్రాంతికి విడుదలై అదరగొట్టిన వీరసింహారెడ్డి.. బాక్సాఫీస్ షేక్ అయిందిగా!
వీరసింహారెడ్డి సాధించిన కలెక్షన్లతో బాక్సాఫీస్ షేక్ అయింది. ఈ సినిమాలోని ఇంటర్వెల్ సీన్ కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. వీరసింహారెడ్డి సినిమాలో ఒక హీరోయిన్ గా శృతి హాసన్ నటించగా మరో హీరోయిన్ గా హనీరోజ్ నటించారు. థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించగా ఈ సినిమాలోని పాటలు సైతం హిట్ అయ్యాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లోని బిగ్గెస్ట్ హిట్లలో ఈ సినిమా ఒకటిగా నిలిచింది.
బాలయ్యకు సంక్రాంతి అచ్చొచ్చిన సీజన్ కాగా ఈ ఏడాది సంక్రాంతికి కూడా బాలయ్య లక్ పరీక్షించుకున్నారు. డాకు మహారాజ్ సినిమా బాలయ్య కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వీరసింహారెడ్డి సినిమాను మించి డాకు మహారాజ్ హిట్ గా నిలవాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. డాకు మహారాజ్ సినిమా 100 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతోంది.
ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో అభిమానులు ఒకింత అసంతృప్తితో ఉన్నారు. ఈరోజు గేమ్ ఛేంజర్ మూవీ నుంచి ట్రైలర్ విడుదలవుతుండగా డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల ట్రైలర్ల గురించి అప్ డేట్స్ రావాల్సి ఉంది. బాలయ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండగా ఈ సినిమాల బాక్సాఫీస్ ఫలితాలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. సినిమా సినిమాకు బాలయ్య రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.