ఇప్పటివరకు ఏ షోలో అడగని ప్రశ్నని అడిగిన బాలయ్య .. రామ్ చరణ్ ని అడ్డంగా ఇరిక్కించేశాడుగా..!?
ఇప్పటివరకు షోకి చాలామంది స్టార్స్ వచ్చారు. అందరినీ చాలా చాలా జెన్యూన్ గానే క్వశ్చన్స్ అడుగుతూ వచ్చారు. ఒకపక్క తమ లైఫ్ లో ఎదురైన సిచువేషన్స్ .. మరొకపక్క సోషల్ మీడియాలో వాళ్లు ఎదుర్కొనే ట్రోలింగ్ ..మరొకపక్క ఇంట్లో భార్యాభర్తల మధ్య ఉండే నాటి క్వశ్చన్స్.. అన్ని కలగలుపు కొని బాలయ్య షో ని చాలా ఎంటర్టైన్నింగా ముందుకు తీసుకెళుతున్నారు. తాజాగా ఈ షో కి గెస్ట్ గా రామ్ చరణ్ వచ్చారు . గేమ్ చేంజర్ సినీ ప్రమోషన్స్ లో భాగంగానే రామ్ చరణ్ ఈ షో కి గెస్ట్ గా వచ్చారు.
అయితే ఈ షోలో చాలా రకాల ప్రశ్నలు అడిగిన బాలయ్య ఒకానొక మూమెంట్లో రామ్ చరణ్ ని ఏ ఇంటర్వ్యూలు అడగని ప్రశ్నని కూడా అడిగేసారట. దీంతో సిగ్గుతో రామ్ చరణ్ మెలికలు తిరిగేశాడట. " మీది లవ మ్యారేజ్ అని తెలుసు.. కానీ ముందు ఎవరు ప్రపోజ్ చేశారు ..ఉపాసనా నా..? నువ్వా..? అంటూ చాలా చిలిపి ప్రశ్న వేశారట". దీంతో రాంచరణ్ నవ్వుతూ.. సిగ్గుపడిపోతూ మెలికలు తిరిగేశారట. అయితే రామ్ చరణ్ ఏం ఆన్సర్ చెప్పాడు అన్నది మాత్రం పూర్తి ఎపిసోడ్ టెలికాస్ట్ అయితే తెలుస్తుంది . మొత్తానికి బాలయ్య - రామ్ చరణ్ లవ్ మ్యాటర్ ని మొత్తం బయటపెట్టేలానే ఉన్నాడు అంటూ కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి..!