రాశిఖన్నా.. ఈ హీరోయిన్ పేరు చెప్తే తెలియని వాళ్ళు ఉండరు.ఈ ముద్దుగుమ్మ ఊహలు గుసగుసలాడే అనే మూవీ ద్వారా తెలుగు చిత్ర సీమ పరిశ్రమలోకి వచ్చి మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో యూత్ ని ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా హిట్ అవ్వడంతో రాశి కన్నా కి తెలుగులో వరుస ఆఫర్లు క్యూ కట్టాలి. ఇక మనం మూవీలో గెస్ట్ పాత్ర చేసినప్పటికీ ఊహలు గుసగుసలాడే సినిమా మాత్రమే సౌత్ లో ఈ హీరోయిన్ కి గుర్తింపుని ఇచ్చింది. ఆ తర్వాత రాశి ఖన్నాకి వరుసగా జోరు, బెంగాల్ టైగర్,శివమ్,జిల్,హైపర్, సుప్రీం, జై లవ కుశ,టచ్ చేసి చూడు, ఆక్సిజన్, తొలిప్రేమ, వెంకీ మామ, వరల్డ్ ఫేమస్ లవర్, ప్రతిరోజు పండగే,థాంక్యూ, పక్కా కమర్షియల్ వంటి తెలుగు సినిమాల్లో చేసింది.అలాగే అంతఃపురం,సర్దార్,తిరు వంటి తమిళ్ సినిమాల్లో కూడా రాశి కన్నా నటించింది.
అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ కెరియర్ 2022 వరకు సౌత్ ఇండస్ట్రీలో చాలా అద్భుతంగా ఉంది.కానీ 2023 నుండి ఈ హీరోయిన్ హవా తగ్గిందని చెప్పుకోవచ్చు. ఇక ఈ ఏడాది మాత్రం రాశి కన్నాకి ఒక్క తెలుగు సినిమాలో కూడా అవకాశం రాలేదు.అలా రాశి ఖన్నాకి టాలీవుడ్ లో పూర్తిగా అవకాశాలు కరువయ్యాయి. ఇక ఈ ఏడాది కుష్బూ భర్త సుందర్.సి స్వయంగా నటించి అలాగే దర్శకత్వం వహించిన అరణ్మై 4 సినిమా రాశి ఖన్నాకి ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో తమన్నా రాశి కన్నాల గ్లామర్ సినిమాకి ప్లస్ అయ్యింది. హారర్ సినిమా అయినప్పటికీ ఇద్దరు హీరోయిన్ల గ్లామర్ తో కూడా సినిమాకి మరింత హైప్ వచ్చింది.
ఇక ఈ సినిమాలో రాశి కన్నా,తమన్నా చేసిన అచ్చో అచ్చో అచ్చోచ్చో అనే పాట ఈ ఏడాది శ్రోతలను ఎంతగానో అలరించింది. అలా ఈ ఏడాది కేవలం అరణ్మై 4 అనే మూవీ మాత్రమే కాకుండా రాశిఖన్నా హిందీలో యోధ, సబర్మతి రిపోర్ట్ వంటి రెండు సినిమాల్లో నటించింది. ఇక రాశిఖన్నా బాలీవుడ్ లో తన అదృష్టం పరీక్షించుకున్నప్పటికీ అక్కడ కూడా ఈ హీరోయిన్ కి అంత గుర్తింపు అయితే రాలేదు. దాంతో మళ్ళీ ఎవరు అవకాశం ఇస్తారా అన్నట్లుగా ఎదురుచూస్తోంది.. ఇక ఈ హీరోయిన్ కి తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు రాకపోవడానికి ఓ హీరో కారణమని,ఆ హీరో తో గొడవల వల్లే రాశి ఖన్నాకి సినిమాల్లో అవకాశాలు రావడం లేదని చాలా రోజుల నుండి ఓ రూమర్ టాలీవుడ్ లో వినిపిస్తోంది.