మరో కొత్త ఏడాది.. వాడుకుంటే వాడుకో.. ఆడుకుంటే ఆడుకో.. పూరీ కామెంట్స్ వైరల్!

Reddy P Rajasekhar
టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాలెంటెడ్ డైరెక్టర్లలో ఒకరైన పూరీ జగన్నాథ్ సోషల్ మీడియా వేదికగా దేని గురించి పోస్ట్ చేసినా ఆ విషయాలు నెట్టింట హాట్ టాపిక్ అవుతుంటాయి. బాలరాజు అనే భక్తుడికి దేవుడికి మధ్య జరిగిన సంభాషణను పూరీ జగన్నాథ్ పంచుకోగా ఆ విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. బాలరాజు కష్టాలు తట్టుకోలేక కఠోర తపస్సు చేశాడని దేవుడు ప్రత్యక్షమై బాలరాజు వంక చిరాకుగా ఏంటి అన్నాడని చెప్పుకొచ్చారు.
 
బాలరాజు దేవునితో స్వామీ ఖర్చులు ఎక్కువైపోయాయని కోట్లకు కోట్లు కావాలని కొంచెం మీ దగ్గర క్యాష్ ఏమైనా ఉంటే నా అకౌంట్ లో డిపాజిట్ చేస్తారా అని అడగగా దేవుడు నా దగ్గర క్యాష్ ఉండదు నాయనా బ్యాంక్ అకౌంట్ కూడా లేదు అని చెబుతాడని చెప్పుకొచ్చారు. పోనీ బంగారం, వజ్రాలు లేవా అని బాలరాజు అడగగా నీకిస్తే అందరూ అడుగుతారమ్మా అని దేవుడు సమాధానం ఇస్తాడు.
 
సరే నాకు ఆనందాన్ని ప్రసాదించాలని బాలరాజు కోరగా సంతోషం అనేది మనసుకు సంబంధించినది అని నువ్వు రోజూ లేనిదాని గురించి ఆలోచిస్తే ఇంకా ఆనందం ఎక్కడినుంచి వస్తుంది అని దేవుడు సమాధానం ఇస్తాడు. అయితే నా లైఫ్ లో కష్టాలను తీసెయ్యాలని బాలరాజు కోరగా దేవుడు మాత్రం బాలరాజుకు మరో విధంగా షాకిస్తాడు.
 
దేవుడు మళ్లీ చెబుతున్నా బంగారం.. నీకు అన్నీ ఇచ్చాను.. ఇప్పుడు మరో కొత్త సంవత్సరాన్ని ఇస్తున్నా.. వాడుకుంటే వాడుకో.. ఆడుకుంటే ఆడుకో.. తాగుతావో తందనాలు ఆడతావో నీ ఇష్టం అంటూ చెప్పుకొచ్చారు. స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. పూరీ జగన్నాథ్ కు 2025 సంవత్సరంలో భారీ బ్లాక్ బస్టర్ హిట్ దక్కాలని అభిమానులు మనస్పూర్తిగా ఫీలవుతున్నారు. పూరీ జగన్నాథ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య ఎక్కువగానే ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: