పారిస్ విధుల్లో థైస్ అందాలతో చక్కెర్లు కొడుతూ షో చేస్తున్న హాట్ బ్యూటీ.!

FARMANULLA SHAIK
లేడీ సూపర్ స్టార్‌ నయనతార సంపాదించుకున్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోలతో సమానంగా క్రేజ్‌ సంపాదించుకున్న నయనతార దాదాపు అందరు అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది. హీరోయిన్‌గా ఫుల్‌ ఫామ్‌లో ఉన్న సమయంలోనే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. రౌడీ పిక్చర్స్‌ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌తో కలిసి సహ నిర్మాతగా మారింది. భర్త విగ్నేష్‌ శివన్‌తో కలిసి పలు సినిమాలను తెరకెక్కించింది.నయనతార విగ్నేశ్ శివన్ను ప్రేమించి 2022లో పెళ్లి చేసుకుంది. సరోగసి ద్వారా ఇద్దరూ పిల్లలకు తల్లైంది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తూ కెరీర్ను ముందుకు తీసుకెళ్తోంది నయన్.నిత్యం సినిమా షూటింగులతో బిజి బిజీగా ఉండే నయన తార ఇప్పుడు కాస్త విశ్రాంతి తీసుకుంటోంది. కెమెరా లైట్లకు దూరంగా తన భర్త, పిల్లలతో కలిసి వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది. అంతేకాదు తమ టూర్ కు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.వెకేషన్ లో భాగంగా తాజాగా నయనతార భర్త, పిల్లలతో కలిసి పారిస్ వెళ్లింది. ఈసారి ఆమె క్రిస్మస్ను అక్కడే చేసుకోనుంది.రెడ్ కలర్ డ్రెస్లో పిల్లలను ఎత్తుకుని,పోనిటైల్ వేసుకుని,వారితో కలిసి తిరుగుతూ  ఎంజాయ్ చేస్తూ క్రిస్మస్ వైబ్స్ని రెట్టింపు చేస్తూ, థైస్ అందాలతో పారిస్ వీధుల్లో సందడి చేసింది నయనతార.ఇక ఈ వెకేషన్ లో నయనతార కుమారులు ఉయిర్‌, ఉలగ్‌లు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. వీరి ఫొటోలను చూసిన అభిమానులు, నెటిజన్లు ఎంతో క్యూట్ గా ఉన్నారంటున్నారు.ఇదిలావుండగా నయనతార కు ఈ ఏడాది పెద్దగా కలిసిరాలేదు.గతేడాది నాలుగు సినిమాలు రిలీజ్ చేసిన నయన్ ఈ ఏడాది సినిమాలేవి రిలీజ్ చేయలేదు.ఇక నయనతార మ్యారేజ్ డాక్యుమెంటరీ అంటూ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది.అయితే జనాలు దీనిని పెద్దగా పట్టించుకోలేదు.వచ్చే ఏడాది అరడజను సినిమాలు లైన్లో పెట్టిన నయనతార, ప్రస్తుతం ఫ్యామిలీ తో కలిసి వేకెషన్స్ ఎంజాయ్ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: