మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్. ట్రిపులార్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత చరణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా కావటంతో గేమ్ చేంజర్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. అంతేకాదు ఈ సినిమా చరణ్ కెరీర్ కు కూడా చాలా కీలకం. ట్రిపులార్ తో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్న చరణ్, ఇప్పుడు గేమ్ చేంజర్ తో అదే ఫీట్ ను రిపీట్ చేయాల్సి ఉంది.ట్రిపులార్ లో చరణ్ తో పాటు నటించిన ఎన్టీఆర్, సోలో హీరోగా చేసిన దేవరతో పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అందుకున్నారు. దీంతో ఇప్పుడు చరణ్ నుంచి కూడా అదే రిజల్ట్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అందుకే ఈ సినిమా రిలీజ్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. చరణ్ కూడా గేమ్ చేంజర్ తో పాన్ ఇండియా స్టార్ గా సెటిల్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఆర్ సీ 16 షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి మరీ గేమ్ చేంజర్ ప్రమోషన్స్ మీద కాన్సన్ ట్రేట్ చేస్తున్నారు.ఇదిలావుండగా తెలుగు చిత్ర పరిశ్రమలో రౌండ్ టేబుల్ చర్చలు ఆసక్తికరంగా మారాయి.
నెక్స్ట్-జెన్ ప్రొడ్యూసర్స్ బన్నీ వాస్, హర్షిత్ రెడ్డి, సహు గరపాటి, సుధాకర్ చెరుకూరి లతో ఈ సంవత్సరం జరిగిన చర్చలో గేమ్ చేంజర్ చిత్రానికి సంబంధించిన విషయాలు హైలైట్ అయ్యాయి.గేమ్ చేంజర్ సినిమాలో ఒక్క రోజుకి వచ్చిన అత్యధిక ఖర్చు గురించి ప్రశ్నించగా. దిల్ రాజు బంధువుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన హర్షిత్ రెడ్డి 2022 వరకు గేమ్ చేంజర్ టీంతో ఉన్నాను అని చెప్పి ఒక పాట షూట్ కోసం భారీ మొత్తం ఖర్చు అయ్యిందని వివరించారు. ఆ మొత్తం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే అన్నారు కానీ నంబర్ మాత్రం చెప్పలేదు.ఒకే పాట కోసం అద్భుతమైన సెట్స్, డ్యాన్సర్లు, ప్రత్యేక లొకేషన్లు, ఆధునిక కెమెరా టెక్నాలజీ వాడటం వల్ల ఈ ఖర్చు భారీగా పెరిగిందని సమాచారం. ఈ ఒక్క రోజుకి ఖర్చు నిర్మాతల ఆర్థిక ఒత్తిడి కూడా పెరిగింది అన్నారు.ఇక ఆపాట ఎంటో, అది ఎలావుండబోతుందో, దానికి అయినా ఖర్చు ఎంతో తెలియాలంటే జనవరి 10వరకు వెయిట్ చేయాల్సిందే.