మెగాస్టార్ ఆ సినిమా రికార్డును చెరిపేసిన శంకర వర ప్రసాద్...!
విదేశీ మార్కెట్‌లో ఈ చిత్రం ప్రభంజనం సృష్టిస్తోంది. అమెరికా బాక్సాఫీస్ వద్ద "మన శంకర వరప్రసాద్ గారు" అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ 3 మిలియన్ డాలర్ల మార్కుకు చేరువలో ఉంది. గతంలో చిరంజీవి కెరీర్‌లో అత్యధిక ఓవర్సీస్ వసూళ్లు సాధించిన 'సైరా నరసింహారెడ్డి' పేరిట ఉన్న 2.7 మిలియన్ డాలర్ల రికార్డును ఈ సినిమా సునాయాసంగా అధిగమించింది. మెగాస్టార్ మ్యానరిజమ్స్, ఆయన నటనకు విదేశీ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ విజయంతో చిరంజీవి తన పాత రికార్డులను తానే తిరగరాసుకుంటూ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని రాజుగా నిలిచారు.
దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని ఒక పూర్తి స్థాయి వినోదాత్మక ప్యాకేజీగా తీర్చిదిద్దారు. చిరంజీవి తనదైన శైలిలో పండించిన కామెడీ టైమింగ్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తోంది. కామెడీతో పాటు గుండెలను పిండేసే భావోద్వేగ సన్నివేశాలు, అదిరిపోయే మాస్ యాక్షన్ సీక్వెన్స్ లు, కళ్లు చెదిరే పాటలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. చిరంజీవి మార్క్ ఎంటర్టైన్మెంట్ మళ్లీ తెరపై చూడటంతో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటించి తన నటనతో సినిమాకు మరింత బలాన్ని చేకూర్చారు.
ఈ భారీ ప్రాజెక్టును సాహు గారపాటి తో కలిసి చిరంజీవి కుమార్తె సుస్మిత సంయుక్తంగా నిర్మించారు. నిర్మాణ విలువల పరంగా ఎక్కడా తగ్గకుండా అత్యున్నత ప్రమాణాలతో సినిమాను రూపొందించారు. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు మాస్ ప్రేక్షకులను కూడా సమానంగా ఆకట్టుకోవడంలో ఈ సినిమా సక్సెస్ అయ్యింది.