సినిమా ఇండస్ట్రీలో రిలేషన్స్ అయితే కామన్.. ఇప్పటి సమాజంలో సినీ ఇండస్ట్రీలోనే కాదు బయట చాలామంది భర్త ఉండగానే అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ బంగారు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అయితే సినిమా ఇండస్ట్రీలో ఇవి మరీ ఎక్కువగా ఉంటాయి. కానీ వీటిని అంతగా పట్టించుకోరు.ఈ విషయం పక్కన పెడితే మహేష్ సినిమాలో నటించిన హీరోయిన్ భర్త ఉండగానే సల్మాన్ ఖాన్ తో ఎఫైర్ పెట్టుకుంది అంటూ తాజాగా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే మహేష్ బాబు రాజకుమారుడు మూవీలో నటించిన ప్రీతిజింతా.. సొట్ట బుగ్గల సుందరి ప్రీతిజింతా టాలీవుడ్లో రాజకుమారుడు వంటి రెండు సినిమాలు చేసింది. ఇక ఎక్కువ శాతం సినిమాలు బాలీవుడ్ లోనే చేసింది.
అయితే ఈ ముద్దుగుమ్మ గతంలో సల్మాన్ ఖాన్ తో ప్రేమాయణం నడిపిందని, వీరిద్దరూ డేటింగ్ చేశారనే వార్తలు వినిపించాయి. ఇక సల్మాన్ ఖాన్ ప్రీతిజింతా కాంబినేషన్లో ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి. ఆ సినిమాలు చేస్తున్న సమయంలోనే ప్రీతిజింతా సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిందని టాక్ ఇండస్ట్రీలో ఉంది. అయితే రీసెంట్ గా సల్మాన్ ఖాన్ బర్త్డే సందర్భంగా ప్రీతిజింతా తన సోషల్ మీడియా ఖాతాలో సల్మాన్ తో ఉన్న ఫోటోని పోస్ట్ చేసి హ్యాపీ బర్త్డే సల్మాన్.. నేను నిన్ను ఎంతగానో లవ్ చేస్తున్నాను.. మిగిలిన విషయం మొత్తం మనం ఎప్పుడైనా కలిసినప్పుడు మాట్లాడుకుందాం.. ఖచ్చితంగా మనం కలిసినప్పుడు ఫోటోలు దిగాలి. లేకపోతే ఇలాంటి పాత ఫోటోలే పెట్టాల్సి వస్తుంది అంటూ రాసుకొచ్చింది.
అయితే ఈ పోస్ట్ చూసిన చాలా మంది నెటిజన్స్ భర్త ఉండగానే సల్మాన్ ఖాన్ ని ప్రేమిస్తున్న అని చెబుతావా.. పాత లవ్ మళ్ళీ గుర్తుకు వస్తుందా ..మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ నిజమే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఈ విషయంపై ప్రీతిజింతా క్లారిటీ ఇస్తూ నేను సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసినట్టు వచ్చిన వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. సల్మాన్ నా కో యాక్టర్..అలాగే నా భర్తకు మంచి స్నేహితుడు. నాకు కూడా క్లోజ్ ఫ్రెండ్.మీరు ఊహించుకున్నట్లు మా మధ్య అదేమీ లేదు. సల్మాన్ నా ఫ్యామిలీ మెంబర్ లాంటివాడు. మీరెన్ని రూమర్లు ఊహించుకున్నా కూడా అక్కడ ఏమీ లేదు అంటూ ప్రీతి జింతా క్లారిటీ ఇచ్చింది