కొత్త పాత్రలో శృతిహాసన్.. ఫ్యాన్స్ ను మెప్పించెనా..?
ఇక డైరెక్టర్ లోకేష్ కనకరాజు తెరకెక్కించే సినిమాలు కూడా ఎలా ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు.. తెరపైన ప్రతిపాత్ర కూడా ఎంతో ఎక్సైటింగ్ గా తీసుకువచ్చేలా తెరకెక్కిస్తూ ఉంటారు. ఈ సినిమాలో శృతిహాసన్ కూడా ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే అయితే ఇంతవరకు ఆమె పాత్ర ఎలా ఉంటుందనే విషయం పైన ఎక్కడ బయటికి రాలేదు. తాజాగా శృతిహాసన్ కూడా యాక్షన్ తో తన పాత్రతో నింపేసినట్లు కనిపిస్తోందట .ప్రస్తుతం సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోందట. ఇక్కడ కొన్ని యాక్షన్స్ సన్ని వేషాలు చిత్రీకరించబోతున్నట్లు సమాచారం.
శృతిహాసన్ యాక్షన్స్ సన్నివేశాలలో పాల్గొంటుందని రజనీకాంత్ ఇంకా షూటింగ్లో పాల్గొనలేదని శృతిహాసన్ తో పాటుగా 300 మంది జూనియర్ ఆర్టిస్టుల సమక్షంలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కథలో భాగంగానే శృతిహాసన్ కాస్త బోల్డ్ గానే కాకుండా హైలెట్ పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. టైట్ ఫిట్ దుస్తులలో మరొకసారి తన గ్లామర్ తో మార్క్ చూపించబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏ మేరకు వైలెంట్ పాత్రలో అభిమానులు శృతిహాసన్ ని చూసి ఒప్పుకుంటారో చూడాలి. డైరెక్టర్ లోకేష్ తో కూడా శృతిహాసన్ కు మంచి అండర్స్టాండింగ్ ఉంది. గతంలో వీరిద్దరూ ఒక యాడ్లో కూడా కనిపించారు. మరి కూలి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.