రాజమౌళి మహాభారతంలో అల్లుఅర్జున్ ఇంట్రెస్టింగ్ రోల్..కన్ఫామ్ చేసిన జక్కన్న..?

murali krishna
ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ అందుకున్నారు డైరెక్టర్ ఎస్ఎస్. రాజమౌళి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా.. హాలీవుడ్ డైరెక్టర్లను మెప్పించింది. ఈసినిమాకు ఆస్కార్ అవార్డ్ అందుకుని హిస్టరీ క్రియేట్ చేసిన జక్కన్నకు ఓ కలల ప్రాజెక్ట్ ఉందనే సంగతి తెలిసిందే. అదే ఇతిహాస గాథ మహాభారతం. ఎప్పటికైనా ఆ సినిమా తీస్తానని అనేక సందర్బాల్లో తెలిపారు. దీంతో జక్కన్న తెరకెక్కించబోయే మహాభారతం సినిమాలో మన టాలీవుడ్ స్టార్స్ ఏఏ పాత్రలలో నటిస్తే బాగుంటుందని.. ఇప్పటికే పాత్రలను డిజైన్ చేసిన పోస్టర్స్ నెట్టింట వైరలయ్యాయి. తాజాగా ఈ సినిమాపై మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేశారు రాజమౌళి. ఒకవేళ ఈ సినిమాను తెరకెక్కిస్తే.. దానిని పది భాగాలుగా ఉంటుందేమోనని అభిప్రాయపడ్డారు.సాధారణంగా జక్కన్న ఒక్క సినిమా సినిమాకు దాదాపు రెండేళ్లు సమయం తీసుకుంటారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా అంటే రెండు నుంచి మూడేళ్ల సమయం పడుతుంది.

అలాంటి ఇప్పుడు పది భాగాలుగా సినిమా అంటే.. దాదాపు పది నుంచి పన్నేండేళ్లు పైనే పడుతుందని అంటున్నారు నెటినజ్స్. ప్రస్తుతం రాజమౌళి తన నెక్ట్స్ ప్రాజెక్ట్ స్క్రీప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నారు. సూపర్ స్టా్ర్ మహేష్ బాబుతో ఆయన నెక్ట్స్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.ఇక ఇదిలా ఉంటే ఇప్పటి వరకు రాజమౌళి అల్లు అర్జున్ తో ఒక్క సినిమా కూడా చేయలేదు. ఇక మహాభారతం సినిమాలో చాలా క్యారెక్టర్స్ ఉన్న నేపధ్యం లో అల్లు అర్జున్ కూడా ఆ సినిమాలో ఒక భాగం కాబోతున్నట్టుగా రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు.
మరి మొత్తానికైతే ఆయనకు ఎలాంటి క్యారెక్టర్ ని ఇవ్వబోతున్నాడనే దాని మీద ఆయన సరైన క్లారిటీ ఇవ్వలేకపోయాడు. కానీ పాండవుల్లో ఒకరిగా మాత్రం ఉండబోతున్నాడనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. మరి అందుతున్న సమాచారం ప్రకారం అయితే అర్జునుడి గా అల్లు అర్జున్ ను చూపించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.మరి ఏది ఏమైనా కూడా ఈ ప్రాజెక్టు కోసం యావత్ ఇండియన్ సినిమా జనాలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి రాజమౌళి ఈ సినిమాని ఎప్పుడు స్టార్ట్ చేసి ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాడనేది ఒక మిస్టరీగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: