గుంటూరు కారం : సూపర్ హిట్.. కానీ ఆ ఒక్క ఏరియాలో మాత్రం తేడా కొట్టింది.. నాగ వంశీ..?

frame గుంటూరు కారం : సూపర్ హిట్.. కానీ ఆ ఒక్క ఏరియాలో మాత్రం తేడా కొట్టింది.. నాగ వంశీ..?

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ బాబు ఆఖరుగా గుంటూరు కారం అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా ... శ్రీ లీల , మీనాక్షి చౌదరి ఈ మూవీ లో హీరోయిన్లుగా నటించారు. జయరాం , రమ్య కృష్ణ , ప్రకాష్ రాజ్ , రావు రమేష్ , రాహుల్ రవీంద్రన్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ని సీతార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మించాడు.


భారీ అంచనాల నడుమ పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయిన ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఇకపోతే తాజాగా ఈ సినిమా నిర్మాత అయినటువంటి నాగ వంశీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా నాగ వంశీ కి మీకు గుంటూరు కారం సినిమా ద్వారా లాభాలు వచ్చాయా అనే ప్రశ్న ఎదురయింది. దానికి ఆయన సమాధానం చెబుతూ ... గుంటూరు కారం సినిమా వల్ల మాకు బాగానే లాభాలు వచ్చాయి అని ఆయన సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్లకు ఆ సినిమా ద్వారా లాభాలు వచ్చాయా అనే ప్రశ్న ఆయనకు ఎదురయింది.


ఆ ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ ... డిస్ట్రిబ్యూటర్లకు కూడా ఆ మూవీ ద్వారా మంచి లాభాలు వచ్చాయి. కానీ ఒక నైజాం ఏరియాలో మాత్రం కాస్త తేడా కొట్టింది అని ఆయన సమాధానం ఇచ్చాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు , రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అత్యంత భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: