రాజ్యసభలో చంద్రబాబుకు చుక్కలు చూపించిన వైసీపీ.. అసలేం జరిగిందంటే?
జగన్ ను పార్లమెంట్ లో లిక్కర్ కుంభకోణం పేరుతో ఇబ్బంది పెట్టాలని కూటమి సర్కార్ ఎంపీలు ప్రయత్నం చేయగా 4000 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని ఆరోపణలు చేయగా వైసీపీ కూటమికి షాకిచ్చే దిశగా అడుగులు వేస్తోంది. చంద్రబాబుకు గతంలో ఇచ్చిన నోటీసులకు సంబంధించిన దర్యాప్తు ఎంతవరకు వచ్చిందని ఆయన ప్రశ్నించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
టీడీపీ సీఎం బాబు ఏపీ బోగస్ కాంట్రాక్ట బాగోతం నడిపారంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ఒకింత సంచలన ఆరోపణలు చేశారు. బోగస్ ఇన్ వాయిస్ లు సృష్టించి 2000 కోట్ల రూపాయలు పన్ను ఎగొట్టారని ఆయన వెల్లడించారు. ఈ ఆరోపణల గురించి టీడీపీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి. బాబును టార్గెట్ చేసే ఏ అవకాశాన్ని వదులుకోకుండా కూటమి సర్కార్ వ్యవహరిస్తూ ఉండటం నెట్టింట ఒకింత హాట్ టాపిక్ అవుతోందనే చెప్పాలి.
అయితే కూటమి సర్కార్ ను ఇరుకున పెట్టాలని వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు ఎంతమేర ఫలిస్తాయనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుండటం గమనార్హం. అయితే వైసీపీకి షాకిచ్చేలా కూటమి సర్కార్ ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తుందో చూడాల్సి ఉంది. ఏపీలో వైసీపీ కేవలం 11 స్థానాల్లో మాత్రమే గెలవడం కూటమికి అన్ని విధాలుగా కలిసొచ్చిందని చెప్పాలి. చంద్రబాబు నాయుడు ఏడు పదుల వయస్సులో కూడా అద్భుతమైన విజన్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తూ ప్రశంసలు అందుకుంటున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే అవసరం లేదని కచ్చితంగా చెప్పవచ్చు.