గీత ఆర్ట్స్ పిలిచిన చిరు నో.. చిన్న కారణం వల్ల పెద్ద నిర్ణయం..?

Pulgam Srinivas
చిరంజీవి తన కెరీర్లో గీత ఆర్ట్స్ బ్యానర్లో అనేక సినిమాలలో నటించిన విషయం మనకు తెలిసిందే. గీత ఆర్ట్స్ బ్యానర్ వారు చిరంజీవి తో నిర్మించిన సినిమాలలో చాలా సినిమాలు అద్భుతమైన విజయాలు అందుకున్నాయి. కొన్ని సినిమాలు అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసి బ్లాక్ బాస్టర్ విజయాలను సొంతం చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న సమయం లోనే మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం అనే ఒక రాజకీయ పార్టీని స్థాపించి రాజకీయాలపై ఆసక్తి చూపించిన విషయం మనకు తెలిసిందే.

ఇక చిరంజీవి రాజకీయాలలో పెద్దగా సక్సెస్ కాలేదు. దానితో మళ్ళీ చిరంజీవి సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అందులో భాగంగా ఖైదీ నెంబర్ 150 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇకపోతే ఈ సినిమా తర్వాత చిరంజీవి చాలా సినిమాలలో హీరో గా నటించాడు. ఆఖరుగా చిరు హీరోగా రూపొందిన భోళా శంకర్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ప్రస్తుతం చిరంజీవి "విశ్వంభర" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి ఇప్పటివరకు గీత ఆర్ట్స్ లో ఏ సినిమా చేయలేదు.

అలాగే సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వార్తలు కూడా ఏమీ రాలేదు. ఇక అందుకు ప్రధాన కారణం చిరు , గీత ఆర్ట్స్ కాంబోలో వచ్చిన సినిమాల్లో చాలా మూవీలు మంచి విజయాలు సాధించడంతో ఈ కాంబోలో సినిమా వస్తే భారీ అంచనాలు ఉంటాయి కాబట్టి ఆ రేంజ్ కథ దొరికినప్పుడు వీరి కాంబోలో సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయి అని అందుకే చిరంజీవి ప్రస్తుతం గీత ఆర్ట్స్ లో సినిమా చేయడం లేదు అని ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: