అల్లు అర్జున్ హీరోగా రూపొందిన పుష్ప పార్ట్ 2 సినిమా డిసెంబర్ 5 వ తేదీన విడుదల అయ్యి ఇప్పటికే అద్భుతమైన కలక్షన్లను వసూలు చేసింది. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన కలక్షన్లను వసూలు చేసింది. ఇప్పటివరకు ఈ సినిమా 16 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఇక 16 వ రోజు మాత్రం ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు భారీగా తగ్గాయి. 16 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల్లో పుష్ప పార్ట్ 2 మూవీ ఏ స్థానంలో ఉందో తెలుసుకుందాం.
16 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో దేవర పార్ట్ 1 మూవీ 3.65 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి మొదటి స్థానంలో నిలవగా , బాహుబలి 2 సినిమా 3.50 కోట్ల కలెక్షన్లతో రెండవ స్థానంలో కొనసాగుతుంది. హనుమాన్ సినిమా 3.21 కోట్ల కలెక్షన్లతో మూడవ స్థానంలో ఉంది. ఆర్ ఆర్ ఆర్ సినిమా 3.10 కోట్ల కలెక్షన్లతో నాలుగవ స్థానంలో కొనసాగుతూ ఉంటే , ఎఫ్ 2 సినిమా 2.56 కోట్ల కలెక్షన్లతో 5 వ స్థానంలో ఉంది. పుష్ప పార్ట్ 1 మూవీ 2.13 కోట్ల కలెక్షన్లతో ఆరవ స్థానంలో కొనసాగుతుంది. సరిలేరు నీకెవ్వరు సినిమా 2.07 కోట్ల కలెక్షన్లతో ఏడవ స్థానంలో కొనసాగుతుంది. కన్నడ డబ్బింగ్ సినిమా కాంతార 1.88 కోట్ల కలెక్షన్లతో 8 వ స్థానంలో కొనసాగుతుంది. రంగస్థలం సినిమా 1.78 కోట్ల కలెక్షన్లతో 9 వ స్థానంలో కొనసాగుతూ ఉండగా , పుష్ప పార్ట్ 2 సినిమా 1.70 కోట్ల కలెక్షన్లతో పదవ స్థానంలో నిలిచింది. ఇలా పుష్ప పార్ట్ 2 సినిమా 16 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్లను చేసిన సినిమాల లిస్టులో పదవ స్థానంలో నిలిచింది.