ఆ డైరెక్టర్ తో అవసరమా తారక్.. ఆ సినిమా చూసైనా నిర్ణయం మార్చుకుంటే బెటర్?

praveen
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటన, స్టార్ డం గురించి తెలుగు జనాలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆయననుండి సినిమా వస్తుందంటే ఎన్టీఆర్ ఫాన్స్ సంబరాలు చేసుకుంటారు. సాధారణంగా ఒక డైరెక్టర్ డైరెక్షన్ లో నటించాలని ఉందని ఓ స్టార్ హీరో చెప్పారంటే... ఆ దర్శకుడు చాలా ప్రతిభావంతుడు అనే చెప్పుకోవాలి. ఇక ఇలా చెప్పడం కూడా చాలా రేర్ ఉంటుంది. గత పదేళ్లుగా తారక్ సినిమా సినిమాకు మార్కెట్ పెంచుకుంటూ పోతున్నారు. తారక్ ప్రస్తుతం వార్2, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సినిమాలతో బిజీగా ఉన్నారు. అసలు విషయంలోకి వెళితే, కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్ డైరెక్షన్ లో నటించాలని ఉందని తారక్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.
దర్శకుడు వెట్రిమారన్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అద్భుతమైన సినిమాలు చేయడంలో వెట్రిమారన్ దిట్ట. అయితే విడుదల2 మూవీ తరువాత మాత్రం ఎన్టీఆర్ ఫాన్స్ కాస్త కంగారు పడుతున్నారు. విషయం ఏమిటంటే విడుదల1 సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే విషయంలో ఫెయిలైందని టాక్ నడుస్తోంది. సెకండాఫ్, స్లో నరేషన్ ఈ సినిమాకు మైనస్ అంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వీరిద్దరి కాంబో సెట్ అయితే చాలా కష్టం అని విశ్లేషకులు కూడా అంటున్నారు. ఎందుకంటే వెట్రిమారన్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలు మంచి సినిమాలుగా పేరును సొంతం చేసుకున్నప్పటికీ కమర్షియల్ గా ఎలాంటి ఫలితాన్ని అందుకున్నాయో అందరికీ తెలిసిందే.
ఈ తరుణంలో తారక్ అట్లీ, లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో నటిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదిక ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ డైరెక్టర్లకు సంబంధించి తారక్ మనస్సులో ఏముందో చూడాల్సి ఉంది. ఇక తారక్ ఇప్పటికే ఓకే చెప్పిన సినిమాలను పూర్తి చేయడానికి కనీసం రెండు మూడు సంవత్సరాలు వ్యవధి పడుతుంది. మరోవైపు తారక్ ఒప్పుకున్న సినిమాల షూటింగ్ చాలా వేగంగా జరుగుతోందని టాక్ నడుస్తోంది. కాగా జూనియర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంగా ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే పుష్ప 2 సినిమా ద్వారా అల్లు అర్జున్ అందరికంటే ఎక్కువగా దాదాపు 300 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకునున్నట్టు సమాచారం. కాగా ఇది ప్రస్తుతం అందరి హీరోల రెమ్యునరేషన్ కంటే ఎక్కువగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: