అదిరిపోయే న్యూస్.. బిగ్ బాస్ 9 తెలుగు ఇంత తొందరగా ప్రారంభమవుతుందా?

praveen
తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షో గురించి జనాలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా బిగ్ బాస్ సీజన్ 8 పూర్తవడంతో ఇపుడు అందరూ బిగ్ బాస్ 9 కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఓటీటీ సీజన్ కాకుండా, మెయిన్ సీజన్ ని అతి తొందరగా ప్రారంభించే ఆలోచనలో ఉందట బిగ్ బాస్ టీం. అవును, ప్రసుతం దానికి సంబంధించిన ఏర్పాట్లు ఈపాటికే మొదలు అయినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. బేసిగ్గా బిగ్ బాస్ సీజన్స్ సెప్టెంబర్ నెలలో మొదలై డిసెంబర్ నెలలో ముగుస్తాయి. కానీ ఈ సీజన్ ని మాత్రం మార్చి నెలలో స్టార్ట్ చేయాలని అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఇది ప్రస్తుతం చర్చల దశలోనే ఉందని భోగట్టా.
అయితే, ఈసారి మాత్రం సీజన్ 8 లో జరిగిన పొరపాట్లు రిపీట్ చేయకుండా ఉండేందుకు చాలా కసరత్తులు చేస్తున్నారట నిర్వాహకులు. ముందుగా బిగ్ బాస్ టీం మొత్తాన్ని ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో సీజన్ 7 కి పనిచేసిన యూనిట్ మొత్తం మార్చివేసే పనిలో ఉన్నారట. దానికోసమే కొత్త ఉద్యోగుల్ని తీసుకొనే పనిలో ఉన్నారట. బిగ్ బాస్ 8 కూడా ఈసారి ప్రేక్షకుల్ని ఊహించిన స్థాయిలో అలరించలేదు. ఓ రకంగా ఈసారి వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్ అనేవి లేకపోతే ఈ సీజన్ ఎంత దారుణంగా ఉండేదో. సీజన్ 6 కంటే పెద్ద డిజాస్టర్ అయ్యేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలా డిజాస్టర్ అవ్వకుండా వైల్డ్ కార్డ్స్ కాపాడారు.
అయితే జరిగిన తప్పుల్ని ఈ సారి బిగ్ బాస్ నిర్వాహకులు ఎట్టి పరిస్థితుల్లోనూ రిపీట్ చేసే యోచనలో లేదు. అందుకే కొత్త స్టాఫ్ ని తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. అవును, ఈసారి షోని ఇంకాస్త ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నారని వినికిడి. అంతేకాకుండా ఈసారి కేవలం తెలుగు ఆర్టిస్టులతోనే సీజన్ ని మొదలు పెట్టబోతున్నారని టాక్ నడుస్తోంది. సీజన్ మొత్తం ఆడియన్స్ కి బాగా పరిచయం ఉన్న వాళ్లనే తీసుకోబోతున్నారట. అంతే కాకుండా పాత సీజన్స్ కి పని చేసిన టీంలోని కొంతమంది ప్రతిభావంతుల్ని కూడా కంటిన్యూ చేయబోతున్నట్టు కూడా తెలుస్తోంది. ఈసారైనా బిగ్ బాస్ టీం అంచనాలు అందుకునే స్థాయికి రీచ్ అవుతుందా లేదా అనేది భవిష్యత్ నిర్ణయిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: