అర్జున్ కపూర్ షాకింగ్ కామెంట్స్ .. బోనీ కపూర్ - శ్రీదేవి పెళ్లిపై గట్టిగా వేసుకున్నాడుగా..?
నాకు 15 ఏళ్ల వయసు ఉన్న సమయంలోనే నాన్న , అమ్మ విడిపోయారు .. ఆ సమయంలో చాలా బాధపడ్డా.. విడాకులు తీసుకున్నప్పుడు నాన్న .. రెండు పెద్ద సినిమాలు చేస్తున్నారు.. పని హడావుడిలో ఉండేవాళ్ళు దీంతో మా మధ్య మంచి రిలేషన్ ఉండేది కాదు .. అలాగే మాటలు కూడా తగ్గాయి .. మాది కాస్త పేరన్న ఫ్యామిలీ కావటంతో ఇంట్లోని విషయాలు తెలుసుకునేందుకు బయట వాళ్ళు ఎక్కువ ఆసక్తి చూపించేవాళ్ళు .. నేను చదువుకునే స్కూల్లో నా క్లాస్మేట్స్ కూడా మా నాన్న గురించి గుసగుసలాడేవారు .. దాంతో చదువుపై ఇంట్రెస్ట్ పోయింది .. సినిమాలపై ఆసక్తి పెరిగింది.
పెరిగి పెద్దయ్యాక మొదటి సినిమా చేశా.. కానీ అది విడుదలయ్యే సమయానికి ముందే అమ్మ చనిపోయింది .. ఇలా జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు ఎదురై నన్ను నేను చాలా మార్చుకున్నా. అలాగే బాగా ఆలోచించడం నేర్చుకున్న.. ఇక దాంతో తర్వాత నాన్నతో మంచి బంధం ఏర్పడింది .. ఇప్పుడు మేమిద్దరం బాగా మాట్లాడుకుంటున్నాం.. నాన్న చేసిన పనికి (శ్రీదేవితో పెళ్లి) ఆయన ఆనందంగా ఉన్నని రోజులు నేను దాన్ని తప్పు అనుకోను అని అర్జున్ కపూర్ చెప్పాడు. 1983లో బోనీ కపూర్ , మోనా పెళ్లి చేసుకున్నారు.. వీరికి అర్జున్, అన్షుల అనే పిల్లలు ఉన్నారు .. ఇక 1996లో ఈ జంట విడాకులు తీసుకుంది .. అదే సంవత్సరం బోనీ కపూర్ , హీరోయిన్ శ్రీదేవిని పెళ్లి చేసుకున్నారు .. ఆ సమయంలో ఇది బాలీవుడ్ లో ఎంతో హాట్ టాపిక్ గా కూడా మారింది.