మీనాని రెండో పెళ్లి చేసుకుంటా.. కూతురు ఉన్నా పర్లేదు.. నటుడు షాకింగ్ కామెంట్స్.?

Pandrala Sravanthi
సౌత్ బ్యూటీ హీరోయిన్ మీనా భర్త చనిపోయాక రెండో పెళ్లి వార్తలు ఎక్కువైపోయాయి. అయితే ఈ హీరోయిన్ ప్రతిసారి నేను పెళ్లి చేసుకోను బాబోయ్ నాయనా నా కూతుర్ని చూసుకొని ఉంటాను అని ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆమెపై రూమర్లు ఆగడం లేదు.అంతేకాదు నటుడు ధనుష్, కిచ్చా సుదీప్ వంటి హీరోలతో మీనా ఫోటోని యాడ్ చేసి మీనా రెండో పెళ్లి చేసుకోబోయేది ఈ హీరోనే అంటూ రూమర్లు గాసిప్ లు రాసుకువస్తున్నారు. అయితే ఈ విషయం గురించి మీనా చాలాసార్లు చెప్పుకొని బాధపడింది.అంతేకాదు మీనా కూతురు నైనిక కూడా ఓ ఈవెంట్లో ఈ విషయాన్ని చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నంత పని చేసింది.అయితే మీనా విద్యాసాగర్ ని పెళ్లి చేసుకోని జీవితాంతం కలిసుందాం అనుకుంది.

కానీ ఆ దేవుడు ఈ జంటను మధ్యలోనే విడగొట్టేసాడు  విద్యాసాగర్ మరణించడంతో మీనా ఒంటరిది అయిపోయింది. ఇక ఇలాంటి సమయంలో మీనా కి సపోర్ట్ ఇవ్వడం పోయి కొంతమంది అయితే ఈమెపై దుష్ప్రచారం చేస్తున్నారు. అయితే మీనా రెండో పెళ్లిపై ఇప్పటికే పలుమార్లు క్లారిటీ ఇచ్చింది.ఇప్పుడైతే నాకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. ప్రస్తుతం నా కూతుర్ని బాగా చూసుకోవాలనే ఉద్దేశమే ఉంది.ఒకవేళ భవిష్యత్తులో చేసుకుంటే చేసుకుంటాను కావచ్చు అంటూ ఒక మాట అంది. ఇక అదే మాటని అదనంగా చేసుకొని మీనా రెండో పెళ్లి వార్తలు వస్తున్నాయి. 

అయితే రీసెంట్గా ఓ నటుడు మీనాకి కూతురు ఉన్న పర్వాలేదు నిన్ను రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక ఆయన ఎవరో కాదు పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన సంతోష్ వర్గీస్.. సంతోష్ వర్గిస్ ఇప్పటికే కమల్ హాసన్ కూతురు అక్షర హాసన్ పై అలాగే మోహన్లాల్ సినిమాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఇబ్బందుల్లో పడ్డాడు.అయితే రీసెంట్ గా హీరోయిన్ మీనా కి కూతురు ఉన్న ఏం కాదు నేను రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అంటూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈయన మాటలపై ఎంతోమంది ఈయన్ని తిట్టిపోస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: