షాక్: గేమ్ ఛేంజర్ కు బ్యాడ్ న్యూస్.. దెబ్బేసిన తెలంగాణ సీఎం..!

Divya
పుష్ప 2 రిలీజ్ సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన సంఘట ఇప్పుడు సినీ ఇండస్ట్రీకి పెద్ద దెబ్బ పడింది. ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయం పైన కాస్త గట్టిగానే పట్టు చూపిస్తున్నారు.. తొక్కిసలాటలో రేవతి మృతితో పాటు కుమారుడు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఉండడంతో.. ఇటీవలే అసెంబ్లీ సమావేశాలలో సంధ్య థియేటర్ ఘటన పైన ఘాటుగానే స్పందించారు. అల్లు అర్జున్ అరెస్టు పైన కూడా మాట్లాడిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయం పైన చాలామంది సోషల్ మీడియా దారుణంగా పోస్టులు పెట్టారని.. అయినా కూడా భయపడనని తెలిపారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.

అయితే ఇలాంటి సమయంలోనే ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారనీ అసెంబ్లీ సమావేశాలలో తెలియజేశారు.. ఇకమీదట తాను సీఎంగా ఉన్నంతవరకు తెలంగాణలో ఎలాంటి బెనిఫిట్ షోలు ,సినిమా టికెట్ల రేటు పెంపు ఉండదు అంటూ క్లారిటీ ఇవ్వడం జరిగింది.. దీంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో రాబోయే సినిమాల పైన ఈ ఎఫెక్ట్ చూపించబోతోంది. ముఖ్యంగా రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా పైన ఈ ప్రభావం పడబోతుందని పలువురు నేటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో ఈ సినిమా రాబోతున్నది.

గ్లోబల్ స్థాయిలో స్టార్ డం వచ్చిన తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా గేమ్ ఛేంజర్ దీంతో అభిమానులు కూడా ఈ సినిమా పైన చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు. హీరోయిన్స్ గా కియారా అద్వానీ , అంజలి వంటి వారు నటిస్తూ ఉన్నారు.. అలాగే సునీల్, ఎస్ జె సూర్య తదితరు నటీనటులు నటిస్తూ ఉన్నారు.. మరి ఇప్పుడు తెలంగాణలో బెనిఫిట్ షోలు బంద్ నేపథ్యంలో కచ్చితంగా కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ పడుతుందని పలువురు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.. రికార్డులన్నీ తిరగరాస్తుంది అనుకుంటున్న సమయంలో ఇలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు.. మరి ఈ ఎఫెక్ట్ ఏపీలో కూడా చూపిస్తుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: