సింహం కూడా కామెడీ చేస్తుందా.. వీడియో వైరల్?
అయితే, అలాంటి క్రూర మృగాలు కామెడీ చేయడం ఎపుడైనా చూసారా? మరీ ముఖ్యంగా అడవికి రాజు అయినటువంటి సింహాలు కామెడీ చేయడం చూసారా? అయితే ఇక్కడి వీడియోని గమనించండి.. మీకే తెలుస్తుంది. అవును, తాజాగా, సింహం పిల్ల వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. నిద్రపోతున్న సింహం వద్దకు వెళ్లిన పిల్ల సింహం.. ఏం చేసిందో తెలిస్తే కడుపుబ్బా నవ్వుతారు. వీడియోని గమనిస్తే... అడవిలోని రోడ్డు పక్కన ఓ పెద్ద మగ సింహం నిద్రపోతుంటుంది. అక్కడే కొన్ని పిల్ల సింహాలు ఆడుకుంటుంటాయి కూడా. అయితే ఈ క్రమంలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది.
ఆడుకుంటున్న సింహం పిల్లల్లో ఒక పిల్ల అక్కడి నుంచి పక్కకు వచ్చి పడుకున్న సింహం వద్దకు వీలు, కాసేపు సరదాగా దాన్ని ఆటపట్టించాలని అనుకుంటుంది. దాంతో మెల్లగా దాని వద్దకు వెళ్లి తోకను పట్టుకుని కొరుకుతోంది. దీంతో పడుకున్న సింహం.. పైకి లేచి.. ‘‘ఎవర్రా మీరంతా?’’.. అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చి పడుకుంటుంది. అయినా ఆ పిల్ల సింహం పదే పదే తోకను పట్టుకుని లాగుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఆ సింహానికి చిర్రెత్తుకొచ్చి... సడన్‌గా పైకి ‘‘పక్కకు వెళ్లి ఆడుకోరా పుస్కీ’’.. అన్నట్లుగా గర్జిస్తూ భయపెడుతుంది. దెబ్బకు భయపడిపోయిన పిల్ల సింహం.. అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయి తోటి పిల్ల సింహంతో ఆడుకుంటుంది. ఇక ఈ ఘటన మొత్తం పర్యాటకుల సమక్షంలోనే జరగగా... అక్కడున్న వారంతా ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.