గెస్ట్ పాత్రలో టాలీవుడ్ సెలబ్రిటీస్.. ఏ సినిమాలో అంటే..?

Divya
టాలీవుడ్ సీనియర్ హీరోలలో హీరో సుమంత్ తన కెరియర్ ప్రారంభం నుంచి ఎప్పుడూ కూడా విభిన్నమైన పాత్రలలో కనిపిస్తుంటారు. పాత్ర నచ్చితే, విలన్ గా కూడా నటించడానికి సిద్ధంగానే ఉంటారు. అయితే హీరో సుమంత్ నటిస్తున్న తాజా చిత్రం మహేంద్రగిరి వారాహి. ఈ చిత్రం మిస్టరీ అండ్ అడ్వెంచర్ ఎలిమెంట్స్ తో రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్ గ్లింప్స్ సినిమా పైన అంచనాలను పెంచేసింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, హీరోయిన్ కీర్తి సురేష్ అతిథి పాత్రలో కనిపించబోతున్నట్లు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు  కూడా ఒకే చిత్రంలో ఇలా క్యామియో పాత్రలో నటించడం ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.. వీరి పాత్రలు ఈ సినిమాలో కీలకంగా ఉండనున్నాయట. వీరి సీన్స్ కూడా హైలెట్ గా ఉంటాయని వినిపిస్తున్నాయి. ఈ సినిమా స్థాయిని మరింత పెంచుతాయంటూ చిత్ర బృందం కూడా భావిస్తోంది. డైరెక్టర్ జగదీష్  ఈ చిత్రాన్ని ఆధ్యాత్మిక మరియు చారిత్రాత్మక నేపథ్యం లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం థ్రిల్లర్ గా కూడా ఉండబోతోంది.


హీరో సుమంత్ కెరియర్ లోనే ఇదొక విభిన్నమైన ప్రయత్నిస్తున్న సినిమాగా తెలుస్తోంది. మరి కీర్తి సురేష్, సిద్దు జొన్నలగడ్డ వంటి సెలబ్రిటీస్ నటించడంతో ఈ సినిమా బిజినెస్ , ప్రమోషన్స్ కి కూడా ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. అయితే ఇప్పటివరకు ఇందుకు సంబంధించి చిత్ర బృందం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే పాత్రలకు సంబంధించి అప్డేట్ వెలుపడే అవకాశం ఉన్నది. ఈ సినిమాతో హీరో సుమంత్ సక్సెస్ కొడతారేమో చూడాలి మరి. హీరోగా సరైన సక్సెస్ అందుకోక చాలా కాలం అవుతుంది సుమంత్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: