హెరాల్డ్ టాలీవుడ్ సూపర్ హిట్స్ 2024: ప్రభాస్, ఎన్టీఆర్ రికార్డులు బ్రేక్ చేసిన "లక్కీ భాస్కర్" ?
దీపావళి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. దాదాపు రూ. 30 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసింది. దుల్కర్ సల్మాన్ కెరీర్ లో రూ. 100 కోట్ల క్లబ్ లో చేరిన మొదటి సినిమా లక్కీ భాస్కర్. తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా ఈ సినిమా నిలిచింది. దీంతో దుల్కర్ సల్మాన్ విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకున్నాడు.
ఈ దశాబ్దంలో వచ్చిన బెస్ట్ మూవీస్ లో లక్కీ భాస్కర్ ఒకటని చెప్పారు. అలాగే ఈ సినిమాలో చాలా జీవిత పాఠాలు కూడా ఉన్నాయని తెలియజేశారు. ఇదిలా ఉండగా ఈ సినిమా వారం రోజుల క్రితం రిలీజ్ అయింది. అప్పుడు ఓటీటీలో ఈ సినిమా అరుదైన విజయాన్ని సొంతం చేసుకుంది.
పాన్ ఇండియా సినిమాలపైనే కల్కి 2898 ఏడి, దేవర వంటి సినిమాల వ్యూవర్స్ షిప్ ని ఈ సినిమా క్రాస్ చేసింది. మొదటి వారంలోనే లక్కీ భాస్కర్ 11.7 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుంది. కల్కి సినిమా మొదటి వారంలో 5.1 మిలియన్ వ్యూస్ ఉండగా, దేవర 8.6 మిలియన్ వ్యూస్ ని మాత్రమే అందుకుంది. ఈ రెండు సినిమాలపైన లక్కీ భాస్కర్ విజయాన్ని సొంతం చేసుకుంది.