తరచూ దొండకాయలు తింటున్నారా.. అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి?
అవును, దొండకాయను ఆయుర్వేదంలో మధుమేహానికి ఔషధంగా వాడుతారు. దీనిలో యాంటీ-అడిపోజెనిక్ ఏజెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచడమే దానికి కారణం. షుగర్ పేషెంట్స్ వారంలో ఒక రోజు దొండ కాయ తిన్నా, దొండ ఆకుల రసం తాగినా రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో ఉండగలవు అని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే దొండకాయలో సహజంగా ఉండే థయామిన్ కార్బోహైడ్రేట్‌లను గ్రూకోజ్‌గా మార్చివేస్తుంది. థయామిన్ రక్త ప్లాస్మాలోకి ప్రవేశించి, మరింత శక్తిని ఉత్పత్తి చేస్తుంది. థయామిన్ ఎర్ర రక్త కణాల తయారీకి కూడా సహాయపడుతుంది. దొండకాయ కొన్ని జన్యుపరమైన వ్యాధులను కూడా నయం చేస్తుందని కూడా చెబుతున్నారు.
ఇక మీరు తరచూ దొండకాయలు తినడం వల్ల రక్తహీనత తగ్గి, చాలా చురుకుగా తయారవుతారు. అంతేకాదండోయ్.. దొండకాయలో స్థూలకాయన్ని నిరోధించే గుణాలు కూడా మెండుగా ఉంటాయి. ఇది ప్రీ - అడిపోసైట్‌లపై నేరుగా పని చేస్తుంది. ఈ క్రమంలో శరీర బరువును కంట్రోల్‌లో ఉంచుతుంది. దొండకాయలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి మలబద్దకం ఉన్నవారి జీర్ణక్రియను ఇది మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా అల్సర్లు, ఎసిడిటీ వంటి జీర్ణ వ్యవస్థ సమస్యలను కూడా దూరం చేస్తుంది. కాన్సర్ ముప్పును తగ్గిస్తాయి. ఇక ఇందులోని బేటా కెరోటిన్ విటమిన్- ఏగా రూపాంతరం చెంది కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. ఇంకా ఆస్తమాను నివారించడంలో కూడా దొండకాయలు కీలక పాత్ర పోషిస్తాయని పలు అధ్యయనాలు ద్వారా తేలింది. కాబట్టి ఇకనుండి దొండకాయలను చిన్నచూపు చూడవద్దు!