పాపం..శుభమాను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటే.. కీర్తి సురేష్ కి ఇలా జరిగింది ఏంటి..?
మరీ ముఖ్యంగా రెండు సాంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకుని అటు అత్తింటి వారిని ఇటు పుట్టింటి వారిని సాటిస్ఫై చేసింది కీర్తి సురేష్ . మహానటి గా పాపులారిటీ సంపాదించుకున్న కీర్తి సురేష్ మొదటగా చెన్నై సంప్రదాయ ప్రకారం గోవాలో పద్ధతిగా పెళ్లి చేసుకుంది. కీర్తి సురేష్ ఆ తర్వాత క్రిస్టియన్ పద్ధతిలోను పెళ్లి చేసుకుంది . ప్రెసెంట్ వీళ్ళ మ్యారేజ్ లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు . త్వరలోనే మాల్దీస్ కి హనీమూన్ కి వెళ్ళిపోతున్నారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది .
అయితే కీర్తి సురేష్ కి పెళ్లి అవ్వగానే ఒక బ్యాడ్ న్యూస్ వినిపించినట్లయింది. కీర్తి సురేష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా కమిట్ అయిన బాలీవుడ్ లో బడా ప్రాజెక్టు నుంచి తీసేసినట్లు సమాచారం అందుతుంది . సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాపై ఆమె చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుందట . బాలీవుడ్ ఇండస్ట్రీలో తనను హై స్థానానికి తీసుకెళ్లే మూవీ ఇదే అంటూ హోప్స్ పెట్టుకుందట . అలాంటి మూవీ నుంచి కీర్తి సురేష్ ని తీసేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కీర్తి సురేష్ ఈ వార్త తెలుసుకుని చాలా బాధపడిపోయిందట . ఎందుకు ఆ ప్రాజెక్ట్ నుండి తీసేసారు అన్నది ఇంకా బయటికి రాలేదు..!