వామ్మో: ప్రేమించాను.. వదిలేస్తున్నానంటూ మృణాల్ ఠాకూర్.. ట్వీట్ వైరల్..!
అవును వదిలేస్తాను కానీ మనస్ఫూర్తిగా ప్రేమించాను అంటూ తన ట్విట్టర్ వేదికగా ఒక కొటేషన్ ని రాసుకుంది ఈ ముద్దుగుమ్మ.. అయితే ఇది పర్సనల్ లైఫ్ గురించి కాదు కానీ తన కొత్త సినిమా ప్రకటన అన్నట్టుగా తెలియజేసింది.. ఫ్యామిలీ స్టార్ సినిమా తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో సైలెంట్ అయిన మృణాల్.. శృతిహాసన్ , అడవి శేషు కాంబినేషన్లో ప్రకటించిన చిత్రం డెకాయిట్.. ఈ చిత్రానికి సంబంధించి పోస్టర్లను గతంలో విడుదల చేయగా కొద్దిరోజులు షూటింగ్ జరుపుకున్న తర్వాత శృతిహాసన్ ఈ సినిమా నుంచి తప్పుకున్నది.
అయితే తాజాగా ఈ రూమర్స్ పై క్లారిటీ ఇస్తూ ఆమె స్థానంలో మృణాల్ ఠాగూర్ ని తీసుకోవడం జరిగింది చిత్ర బృందం. ఈరోజు అడవి శేషు పుట్టినరోజు సందర్భంగా డెకాయిట్ చిత్రానికి సంబంధించి ఒక కొత్త పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు.. ఇందుకు సంబంధించి హీరోయిన్ గా కూడా మృణాల్ ఠాకూర్ నటిస్తోందని అందుకు సంబంధించి పోస్టర్ని కూడా రిలీజ్ చేస్తూ పలు రకాల అప్డేట్లను ఇస్తూ ఉంది చిత్ర బృందం. అటు అడవి శేషు కూడా షేర్ చేసిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి ఏమేరకు ఈ సినిమా కలిసొస్తుందో చూడాలి.