తెలుగు చిత్ర పరిశ్రమకు దిష్టి తగిలిందా .. వరుస వివాదాల్లో స్టార్ సెలబ్రిటీలు..?
ఇక గత వారం రోజులుగా మంచు మోహన్ బాబు ఫ్యామిలీ వివాదం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది .. అది పూర్తిగా వారి వ్యక్తిగత విషయాలైనప్పటికీ ఈ కుటుంబంలో జరిగిన గొడవ గురించి తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మోహన్ బాబు , మంచు విష్ణు ఒకవైపు ఉంటే , మనోజ్ మాత్రం ఒంటరిగా వారిపై పోరాటం చేస్తున్నట్లు కనిపిస్తుంది .. ఇక ఈ విషయం వీరి మధ్య గొడవలకు కారణం అయ్యింది .. ఈ విధంగా మంచు కుటుంబంలో వివాదం ముగిసింది అనుకుంటున్న సమయంలో .. అల్లు అర్జున్ అరెస్ట్ ఒక్కసారిగా చిత్ర పరిశ్రమను షాక్కు గురిచేసింది .. పుష్ప 2 సినిమా రిలీజ్ సమయంలో సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసులాటలోరేవతి అనే మహిళా చనిపోయింది .. దీంతో ఆ వివాదం అల్లు అర్జున్ మెడకు చుట్టుకుని ఏకంగా ఆయనను జైలు పాలు చేసింది.
పాన్ ఇండియా స్టార్ గా జాతియ అవార్డు అందుకున్న ఒక హీరోని తొక్కిసిలాటలో ఓ అభిమాని చనిపోతే .. అరెస్టు చేయడంతో తీవ్ర వ్యతిరేకత కనిపించింది .. వీరందరితో పాటు ఒకప్పటి విలక్షణ దర్శకుడు రాంగోపాల్ వర్మ , ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సైతం కొద్దిరోజుల క్రితం వివిధ కారణాలతో పలు వివాదాల్లో చిక్కుకున్నారు .. చిన్న చిన్న విషయాలకి టాలీవుడ్ ఇండస్ట్రీలో కొందరు అగ్రనటులు వరుస ఇబ్బందుల్లో ఇరుక్కుంటున్నారు .. ఇక దీంతో తెలుగు చిత్ర పరిశ్రమకు దిష్టి తగిలిందని కొందరు అంటున్నారు .. అందుకే అగ్ర నటులు వరుసగా ఇలా వివాదాల్లో ఇరుక్కుంటున్నారని సోషల్ మీడియాలో నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.