అంత పిచ్చ కోపం ఉన్న బన్నీ.. అరెస్టుపై ఇంత కూల్ గానా..?

Thota Jaya Madhuri
అల్లు అర్జున్ కి చాలా కోపం . అది అందరికీ తెలుసు . కానీ ఎక్కడ ..? ఎప్పుడు ..? ఎలా..? ప్రదర్శించాలో అలాగే ప్రదర్శిస్తారు . ఆ విషయం చాలా తక్కువ మందికే తెలుసు.  అసలు తన తప్పులేదు రా బాబు అంటూ చెప్పినా కూడా పోలీసులు అరెస్ట్ చేయడం ..అది కూడా జైల్లో పెట్టే అంత నేరంగా భావించి జైల్లో పెట్టడానికి ఇంకా ప్లాన్ తో అరెస్ట్ చేయడం అభిమానులకి షాకింగ్ గా అనిపించింది.  బన్నీ ప్లేస్ లో ఏ హీరో ఉన్నా సరే ఫుల్ ఫైర్ అయిపోతారు . అసలు పోలీసులకు సపోర్ట్ చేయరు. ఏదేదో మాట్లాడుతారు . అసలు ఇక ఆ కుటుంబ సభ్యులు అయితే సోషల్ మీడియాలో నాన్న రచ్చ రంబోలా చేస్తారు.


కానీ అల్లు ఫ్యామిలీ అలా చేయనే చేయలేదు . భార్య స్నేహారెడ్డి తండ్రి అల్లు అరవింద్ చాలా చక్కగా సమయస్ఫూర్తిగా సిచువేషన్ ని హ్యాండిల్ చేశారు . మరి ముఖ్యంగా అల్లు అర్జున్ కూడా ఎక్కడ మీడియా ముందు టంగ్ స్లిప్ అవుతూ తెలంగాణ గవర్నమెంట్ ని కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కానీ దూషించింది లేదు. కానీ బన్నీ ఫ్యాన్స్ మాత్రం బాగా రెచ్చిపోయి మాట్లాడారు. పలువురు స్టార్ సెలబ్రిటీస్ సైతం..రేవంత్ రెడ్డి పై పరోక్షకంగా ఘాటుగా మాట్లాడారు.


టైం వచ్చినప్పుడు చూపించే విధంగానే అల్లు అర్జున్ తన టాలెంట్ ని చక్కగా ఉపయోగించుకున్నారు . అయితే చాలా కోపం ఉన్న అల్లు అర్జున్ ఇంత కోపాన్ని కంట్రోల్ చేసుకుని మీడియా ముందు ప్రశాంతంగా మాట్లాడడం చాలా ఆశ్చర్యకరంగా ఉందంటున్నారు అభిమానులు. వేరే ఏ హీరో అయిన సరే చీల్చి చెండాడే వాడు. అల్లు అర్జున్ రాత్రంతా తన తప్పు లేకపోయినా జైల్లో పెట్టిన చాలా కూల్ గా మాట్లాడాడు అని.. అది అల్లు అర్జున్ మంచితనం అంటూ అల్లు అర్జున్ ని ప్రశంసిస్తున్నారు.  అయితే అల్లు అర్జున్ నెక్స్ట్ ఏ ఈవెంట్ కి హాజరైన తగిన జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటున్నారు జనాలు . చూద్దాం మరి దెబ్బ తిన్న పాము ఎంత జాగ్రత్తగా ఉంటుందో అలాగే బన్నీ కూడా ఉంటాడో లేదో..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: