అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో భారీ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక స్టార్ డమ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఇప్పుడు పుష్ప 2 భారీ కలెక్షన్లను సాధిస్తున్న వేళ సంతోషంగా ఉండాల్సిన సమయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిన్న అనగా డిసెంబర్ 13 మధ్యాహ్నం 12 గంటలకు అరెస్టయ్యారు. ఈ విషయం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ వరకు పాకిపోయింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఆయన అభిమానులు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. తమ అభిమాన హీరోని అరెస్ట్ చేయడం పై ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా విచారణ జరిపిన అనంతరం నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించగా అల్లు అర్జున్ న్యాయవాది బెయిల్ కావాలి అని హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఇక్కడ క్వాష్ పిటిషన్ వేయగా వ్యక్తిగత పూచికత్తు పైన హైకోర్టు ధర్మాసనం నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే బెయిల్ వచ్చిన సరే అల్లు అర్జున్ ను రాత్రంతా చంచల్గూడా జైల్లోనే ఉంచారు పోలీసులు. జైలు నుంచి ఈ రోజు ఉదయం బెయిల్ మీద బయటకు వచ్చారు.ఇదిలావుండగా బన్నీ అరెస్ట్ పై అనేక రకాల ట్రోలింగ్స్ మొదలయ్యాయి.బన్నీ ఫ్యాన్స్ ఆయనకు అండగా ఉండగా.. ట్రోలర్స్ మాత్రం తమ చేతులకు పనిచెప్పారు. బన్నీని ట్రోల్ చేస్తూ మీమ్స్ వేస్తున్నారు. పుష్ప 2 సమయంలో బన్నీ, బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించిన అన్ స్టాపబుల్ షోలో సందడి చేసిన విషయం తెల్సిందే.అప్పుడు నేషనల్ అవార్డు గురించి బన్నీ మాట్లాడుతూ.. ” టాలీవుడ్ హీరోలందరిలో ఎవరైనా నేషనల్ అవార్డు తీసుకున్నారా.. ? అని చూసాను. ఇంతవరకు ఎవరు అవార్డు తీసుకోలేదు. దాన్ని రౌండ్ అప్ చేశా .. అవార్డును అందుకున్నా” అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అదే డైలాగ్ ను మార్చి.. “టాలీవుడ్ హీరోల్లో ఎవరైన అరెస్ట్ అయ్యారా అని చూస్తే.. ఇంత వరకు ఎవరు అరెస్ట్ అవ్వలే దాన్ని రౌండ్ అప్ చేశా. అరెస్ట్ అయ్యా. ఇది సర్ నా బ్రాండు” అంటూ మీమ్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారాయి.