బన్నీని అరెస్ట్ చేయడం అల్లు ఫ్యామిలీకి ఇంతలా కలిసి వచ్చిందా..? ఏం లక్ రా బాబు..!

Thota Jaya Madhuri
ఇప్పుడు ఎక్కడ చూసినా సరే స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ కు సంబంధించిన విషయాలు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు . మరి ముఖ్యంగా అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం ఆ తర్వాత నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లడం ఆ తర్వాత జైల్లో పెట్టే విధంగా చెంచల్ గూడ  జైల్లుకు తీసుకెళ్లడం ..మధ్యలో  మధ్యాంతర  బెయిల్ వచ్చినా కూడా రాత్రంతా చెంచల్ గూడ జైల్లోనే బన్నీను ఉంచారు . అది అందరికీ తెలిసిన విషయమే . దీన్ని బట్టి క్లియర్గా అర్థమైపోతుంది బెయిల్ వచ్చినా కూడా అల్లు అర్జున్ ని బయటికి పంపియ్యకుండా నానా రాద్ధాంతం చేస్తూ రాత్రంతా జైల్లోనే పెట్టి కక్ష సాధింపు హ్యాపీనెస్ ను ఎంజాయ్ చేసింది తెలంగాణ ప్రభుత్వం అంటూ చాలామంది జనాలు మాట్లాడుకుంటున్నారు .


మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డిని ఓ రేంజ్ లో ఏకిపారేస్తున్నారు. రేవంత్ రెడ్డి కావాలనే చేశాడు అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు . కానీ రేవంత్ రెడ్డి వర్షెన్ మాత్రం వేరేలా ఉంది . తప్పు చేస్తే ఎవరినైనా శిక్షిస్తాం. బన్నీపై నాకు ఎటువంటి పర్సనల్ శ్త్రుత్త్వం లేదు ..ఇంకా ఆయన సతీమణి నా కుటుంబానికి చాలా కావాల్సినవారే అంటూ క్లారిటీ ఇచ్చారు . అయితే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం చాలా మంచిది అయింది అంటుంది టాలీవుడ్ ఇండస్ట్రీ . ఎందుకంటే అల్లు అర్జున్ ని పుష్ప సినిమా విషయంలో చాలామంది టాలీవుడ్ హీరోలు నెగిటివ్గా చూసారు.

 
మరీ ముఖ్యంగా కొంతమంది సినిమాను ఫ్లాప్ చేస్తామంటూ కూడా ఓపెన్ సవాళ్లు విసిరారు . అయితే అలాంటివి పెద్దగా పట్టించుకోలేదు అని.. అలా అని బన్ని  పాజిటివ్ గా కూడా రియాక్ట్ అవ్వలేదు . పరోక్షంగా కొంతమందికి బన్ని శత్రువుగా మారిపోయాడు . అయితే అరెస్టు పుణ్యమా అంటూ ఇప్పుడు బన్నీ ఇంటికి టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ ప్రముఖులందరూ కదిలి వస్తున్నారు . అల్లు అర్జున్ ని హగ్ చేసుకుని మరి ఆయనను అభినందిస్తున్నారు. చాలా ధైర్యంగా ఉన్నావంటూ మెచ్చుకుంటున్నారు. ఒకందుకు అల్లు అర్జున్ అరెస్ట్ మంచిదయింది అని.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు బన్నీకి శత్రువులు లేకుండా పోయారు అంటున్నారు జనాలు . అయితే అల్లు అర్జున్ కెరీర్లో ఎప్పుడు కూడా డిసెంబర్  13 ని మర్చిపోలేడు అంటూ ఫ్యాన్స్ బాధపడిపోతున్నారు. కాగా పుష్ప సినిమా ఏ సినిమా బీట్ చేయని రికార్డ్స్ ను బీట్ చేసి సరి కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: