బన్నీ టైం బ్యాడ్ అక్కడి నుంచే మొదలైంది.. ఫ్యాన్స్ కూడా గుర్తించలేకపోయారే..!
రీసెంట్ గా అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేయడం ఆయన లైఫ్ లోనే మర్చిపోలేని గుర్తుగా మిగిలిపోతుంది అంటూ పలువురు ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా అల్లు అర్జున్ ఏ 11నిందితుడిగా పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాదు ఆయనను జైల్లో పెట్టడానికి కూడా బాగా ట్రై చేశారు. కానీ మధ్యంతర బెయిల్ రప్పించుకొని అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ తన స్టామినా ఏంటో ప్రూవ్ చేశారు . అయితే అల్లు అర్జున్ కి సంబంధించిన కొన్ని వార్తలు ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి . అల్లు అర్జున్ పేరు ఎప్పుడు కూడా పాజిటివ్ వేలో ట్రెండ్ అవుతుంది. ట్రెండ్ అవుతూనే ఉండేది అని.. ఎప్పుడైతే నేషనల్ అవార్డు గెలుచుకున్నాడో అప్పటినుంచి అల్లు అర్జున్ అంటే ఒక సర్టెన్ బ్యాచ్ నెగిటివ్గా ట్రోల్ చేయడం ప్రారంభించింది అని..
అల్లు అర్జున్ కి కూడా అప్పటినుంచి టైం బ్యాడ్ అవ్వడం మొదలైంది అంటున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. బన్నీ నిజంగానే హెడ్ వెయిట్ గా బిహేవ్ చేశాడో..? లేకపోతే పుష్పరాజ్ పూనినట్టు పుష్పరాజులా మాట్లాడాడో.. అందరికంటికి అలా కనిపించాడో తెలియదు కానీ పుష్ప ప్రమోషన్స్ లో భాగంగా కొన్ని ఈవెంట్స్ లో అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి . కొందరు ఆయనను ట్రోల్ చేశారు . మరి కొందరు మెగా హీరోస్ ని అసలు పట్టించుకోవడం లేదు అంటూ బాగా నెగిటివ్ గా కామెంట్స్ చేశారు . మొత్తానికి అల్లు అర్జున్ ఏ ముహూర్తాన నేషనల్ అవార్డు అందుకున్నాడో కానీ అప్పటి నుంచే బన్నీ టైం బ్యాడ్గా మారిపోయింది అంటున్నారు బన్నీ అభిమానులు. ఇకనైనా అల్లు అర్జున్ ని ఆయన లైఫ్ ఆయన బతకనివ్వండి ఇప్పటికే చాలా చాలా ఎదురు దెబ్బలు తిన్నాడు ..అల్లు అర్జున్ త్వరగా ఈ సమస్యల నుంచి బయట పడాలి అంటూ దేవుడిని ప్రార్థిస్తున్నారు అల్లు అర్జున్ అభిమానులు..!