"హౌ ఆర్ యు బావ" అంటూ మోహన్ బాబుకు స్పెషల్గా కాల్ చేసిన తెలుగు స్టార్ హీరో..ఎంత మంచోడో..?

Thota Jaya Madhuri
మోహన్ బాబు ఆరోగ్యం అస్సలు బాగోలేదు అన్న విషయం అందరికీ తెలిసిందే . గత నాలుగు రోజులుగా మంచు  ఫ్యామిలీ లో జరుగుతున్న గొడవలు మీడియాలో లైవ్ టు లైవ్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో మోహన్ బాబు ఫ్యామిలీ కి సంబంధించిన కొన్ని వార్తలు బాగా హర్ట్టింగా కూడా ఉన్నాయి . అయితే తండ్రి కొడుకులు మధ్య ఇలాంటి గొడవలు ఏంటి..? అంటూ చాలామంది  బాధ కూడా పడ్డారు . త్వరలోనే వీళ్ళ మధ్య అంత సర్దుమణగాలి అంటూ కూడా కొందరు ఓపెన్ గానే సోషల్ మీడియా వేదికగా బయటపెట్టారు .


అయితే మోహన్ బాబుకు బీపీ ఎక్కువైన కారణంగా మంచు విష్ణు హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు . రీసెంట్ గానే డిశ్చార్జ్ అయ్యారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ ..మోహన్ బాబుకు కాల్ చేసి మరి ఆయన హెల్త్ గురించి ఆరా తీసారట . ఫ్యామిలీ గొడవల గురించి అస్సలు మాట్లాడని ప్రభాస్ కేవలం మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితి కోసమే కాల్ చేసి మరీ ఆరోగ్య బాగోగులు తెలుసుకున్నారు అంటూ ఓ వార్త మీడియాకు లీకై వైరల్ గా మారింది.


కాగా వీళ్ల కాంబోలో వచ్చిన "బుజ్జిగాడు" సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ప్రభాస్ ఈ సినిమాలో మోహన్ బాబును బావ బావ అంటూ సరదాగా ఆట పట్టిస్తూ ఉంటాడు. అయితే ఆ తర్వాత కూడా చాలా విషయాలలో చాలా మూమెంట్స్ లో మోహన్ బాబును బావ బావ అంటూనే పిలుస్తూ వచ్చారట. ఆశ్చర్యం ఏంటంటే ఇప్పటికి కూడా ఆయన అలాగే బావ బావ అంటూ పిలుస్తూ వస్తారట . దీంతో సోషల్ మీడియాలో మోహన్ బాబు కి ప్రభాస్ కాల్ చేసి బాగోగులు తెలుసుకున్నాడు అన్న వార్త బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది. ప్రభాస్ అందరి పక్షాన ఉంటాడు అని ఆయన కల్మషం లేని మనసు అని ఓ రేంజ్ లో రెబల్ ఫ్యాన్స్ పొగిడేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: