సీమ సింహం : సంక్రాంతికి వచ్చింది.. రిజల్ట్ చూసి బాలయ్య ఫ్యాన్స్ షాక్..?

Pulgam Srinivas
నందమూరి నట సింహం బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలయ్య ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించాడు. ఇకపోతే బాలయ్య తన కెరీర్ లో ఎన్నో సినిమాలను సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేశాడు. ఇక బాలయ్య నటించిన ఎన్నో సినిమాలు సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి అద్భుతమైన విజయాలను అందుకున్న సందర్భాలు ఉన్నాయి. ఏకంగా కొన్ని సినిమాలు ఇండస్ట్రీ హిట్లుగా కూడా నిలిచాయి.

ఇకపోతే బాలకృష్ణ సంక్రాంతి పండుగకు వచ్చి హిట్లు , బ్లాక్ బాస్టర్లు , ఇండస్ట్రీ హిట్లు ఏ విధంగా కొట్టాడో కొన్ని ఫ్లాప్స్ కూడా అందుకున్నాడు. అలా బాలయ్య సంక్రాంతి పండుగకు వచ్చి సీమ సింహం అనే సినిమాతో ఫ్లాప్ ను అందుకున్నాడు. ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అందుకు ప్రధాన కారణం సీమ సింహం సినిమా 2002 వ సంవత్సరం జనవరి 11 వ తేదీన సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయింది. ఇక ఈ సినిమా కంటే ముందు బాలకృష్ణ హీరో గా రూపొందిన నరసింహ నాయుడు సినిమా 2001 సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి ఏకంగా ఇండస్ట్రీ హిట్ అయింది. అంత పెద్ద విజయం తర్వాత సంవత్సరం సంక్రాంతి పండుగకు వస్తున్న సినిమా కావడంతో సీమ సింహం సినిమాపై బాలయ్య అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

కానీ ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. జి రాంప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సిమ్రాన్ , బాలకృష్ణ కి జోడిగా నటించగా ... మణిశర్మ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఇక నరసింహ నాయుడు లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత సంవత్సరం సంక్రాంతికి వచ్చి ఈ సినిమా ఫ్లాప్ కావడంతో బాలయ్య అభిమానులు ఆ సమయంలో తీవ్ర నిరుత్సాహ పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: