హైదరాబాద్‌లో మోస్టు వాటెండ్‌ లేడీ డాన్‌.. దొరికిపోయిందిగా?

Chakravarthi Kalyan
పది కేసుల్లో పోలీసులకు, ఎక్సైజ్‌ పోలీసులకు దొరకుండా తప్పించుకు తిరుగుతున్న మోస్టు వాంటెడ్‌ లేడీ డాన్ అంగూర్‌ బాయ్‌ దొరికిపోయింది. కార్వాన్‌లో ఎక్సైజ్‌ పోలీసులకు పట్టుబడింది అంగూర్‌ బాయ్‌. ధూల్‌పేట్‌లో గంజాయి డాన్‌గా పిలువబ డుతున్న అంగూర్‌ బాయ్‌ని కార్వాణ్‌ ప్రాంతంలో ఎస్ టి ఎఫ్ , ఎక్సైజ్‌ పోలీసులు అరెస్టు  చేశారు.

గంజాయి అమ్మకాల్లో రూ. కోట్లకు పడగెత్తిన అంగూర్‌ బాయ్‌పై ధూల్‌పేట్‌ ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో 3 కేసుల్లోను, మంగల్‌హట్‌ పోలీస్‌  స్టేషన్‌లో 4 కేసుల్లోను ఆసిఫ్ నగర్ , గౌరారం స్టేషన్లలో పది కేసులు ఉన్నాయి. ఈ కేసుల్లో అరెస్టు చేయడానికి ఎక్సైజ్‌, పోలీసులు  ఎన్నిమార్లు నిఘా పెట్టిన అంగూర్‌ బాయ్‌ తప్పించుకొని  తిరుగుతొంది.

అంగూర్‌ బాయి ఇప్పటికే 13 కేసుల్లో నిందితురాలుగా జైలుకు వెళ్లి వచ్చింది. కోర్టుల చుట్టు తిరుగుతుంది. అంగూర్‌ బాయ్‌ ఇంట్లో ఉన్న కుటుంబ  సభ్యులు పది నుంచి 15  మందిపై ఐదు నుంచి పది కేసులు ఉన్నాయి. ధూల్‌పేట్‌లో గంజాయి  హూల్‌సేల్‌, రిటేల్‌ అమ్మకాల్లో అరితేరిన అంగూర్‌ బాయ్‌ని అపరేషన్‌  ధూల్‌పేట్‌లో భాగంగా అరెస్టు చేశారు. అంగూర్‌ బాయ్‌ని అరెస్టు చేసిన ఎస్ టి ఎఫ్ , ఎక్సైజ్‌ పోలీసులను ఎక్సైజ్‌  ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ వి.బి. కమలాసన్‌రెడ్డి అభినందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

don

సంబంధిత వార్తలు: