ఆంధ్రాలో ఎన్‌ఐఎన్‌ సోదాలు.. ఏం దొరికాయంటే?

Chakravarthi Kalyan
ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టులకు ఆయుధాలు, పేలుడు పదార్ధాలు సరఫరా చేస్తున్న కేసులో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్, చత్తీస్ ఘడ్, ఒడిశాలో సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ.. ఆంధ్రప్రదేశ్ లోని చింతూరులో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో కొన్ని డిజిటల్ పరికరాలు, పత్రాలు స్వాధీనం చేసుకున్న జాతీయ దర్యాప్తు సంస్థ.. ఈ కేసులో సంబంధం ఉన్న ఏడుగురు నిందితుల ఇళ్లలో సోదాలు చేసింది.
ఇప్పటికే ఈ వ్యవహారానికి సంబంధించి ఇద్దర్ని అరెస్టు చేసిన ఎన్ఐఏ.. చింతూరు పోలీసులు నమోదు చేసిన కేసును 2024సెప్టెంబరులో తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వీరి వద్ద నుంచి పేలుడు పదార్ధాలు, విప్లవ సాహిత్యం, నగదు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించింది.
మావోయిస్టులకు పెద్దఎత్తున ఆయుధాలు, ఇతర ఉపకరణాలు సరఫరా చేస్తున్న నెట్వర్క్ ను గుర్తించిన ఎన్ఐఏ.. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసు బలగాలను చంపేందుకు కుట్రపన్నినట్టు పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

nia

సంబంధిత వార్తలు: