చంద్రబాబు విజన్ 2047.. యాక్షన్ ప్లాన్ ఇదే?
ప్రతీ మూడో శనివారం స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా నిర్దేశించామన్న చంద్రబాబు.. ఇప్పటికే 25 విధానాలు ప్రకటించాం మరో నాలుగైదు విధానాలు కూడా రూపోందిస్తామని.. వాట్సప్ గవర్నెన్సు త్వరలోనే అమలు చేస్తామని.. సీసీ టీవీ, డ్రోన్లు, ఐఓటీ, ఫోన్లు, ఏఐ లాంటి సాంకేతికతను వాడుకుని మెరుగైన పాలన అందించాలని కలెక్టర్లకు సూచించారు. ప్రతీ అంశంలోనూ వ్యయం తగ్గించగలిగితే సుస్థిరత వస్తుందని.. ప్రజల ప్రాణాలు, ఆస్తులు శాంతిభద్రతలకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు అంటున్నారు.
ఒక కుటుంబానికి ఒక పారిశ్రామిక వేత్త అనే విధానం సమర్ధంగా అమలు కావాలంటున్న చంద్రబాబు.. పీ4 విధానం ప్రతీ చోటా అమలు కావాల్సిందేనని.. పోర్టులు పరిశ్రమలకు భూసేకరణలో అమరావతి భూసమీకరణ మోడల్ ను అనుసరించాలని.. పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, జల్ జీవన్ మిషన్ ద్వారా తాగునీరు అందించాలని చెబుతున్నారు.
అమృత్ స్కీమ్ అమలు పైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని.. ఉపాధి హామీ పథకాన్ని గరిష్టంగా వినియోగించుకుని ఆస్తులు సృష్టించాలని.. విద్యుత్ రంగం రాష్ట్రానికి ఓ గేమ్ చేంజర్ అవుతుందని.. ప్రతీ ప్రభుత్వ కార్యాలయం పైనా రూఫ్ టాప్ సోలార్ ప్యానళ్లు పెట్టాలని.. పీఎం సూర్యఘర్, కుసుమ్ యోజనలను సమర్ధంగా వాడుకోవాలని.. ప్రతీ ప్రభుత్వ కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేయాలని.. ప్రతీ ప్రణాళికలోనూ 10 సూత్రాలను మిళితం చేయాలని సూచిస్తున్నారు.