అవంతి, గ్రంధి శ్రీనివాస్ తో పాటు.. మరో ఇద్దరూ జనసేనలోకి జంప్?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ పార్టీకి దారుణమైన ఓటమి ఎదురైన సంగతి తెలిసిందే. వైసీపీ పార్టీ ఓడిపోయిన బాధలో ఉన్న  వైయస్ జగన్మోహన్ రెడ్డికి.... వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. రోజుకొక నేత కూటమి వైపు వెళ్తున్నారు. కీలక నేతలందరూ వైసీపీ... జంప్ అవుతున్నారు. వైసీపీకి రాజీనామా చేసిన చాలామంది లీడర్లు ఎక్కువ శాతం జనసేన వైపు చూస్తున్నారు.

జనసేన కూడా.... వైసిపి నేతలను భారీగానే టార్గెట్ చేస్తోంది. ఛాన్స్ దొరికితే ఏ లీడర్ అయినా... వదలడం లేదు. అయితే.. తాజాగా భీమిలి మాజీ ఎమ్మెల్యే, ఏపీ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ తాజాగా వైసిపి పార్టీకి రాజీనామా చేశారు. ఇవాళ వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు అవంతి శ్రీనివాస్. ఈ మేరకు లేక విడుదల చేశారు అవంతి శ్రీనివాస్.

దీంతో అవంతి శ్రీనివాస్...  టచ్ లోకి తెలుగుదేశం పార్టీ నేతలే వస్తున్నారు.  కానీ ఆయన మెగాస్టార్ చిరంజీవితో చర్చలు జరిపి జనసేనలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారట.   మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ తో పాటు... భీమవరం మాజీ ఎమైల్యే గ్రంధి శ్రీనివాస్  కూడా వైసిపి పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఆయన కూడా అనుచరులతో ఇదే విషయాన్ని తేల్చి చెప్పారట.

ప్రస్తుతం వైసీపీ నేత గ్రంధి శ్రీనివాస్... ఐటి రైడ్స్‌ ఎదుర్కొంటున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో... వైసిపి పార్టీకి గుడ్ బై చెప్పి జనసేనలోకి వెళ్లేందుకు... సన్నద్ధమవుతున్నారట. ఈ మేరకు జనసేన నేతలతో కూడా... చర్చలు జరుపుతున్నారట. అన్ని ఓకే అయితే వారంలో రోజుల్లోగా జంప్‌ ఖాయమట. ఇక మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్... భీమవరం మాజీ ఎమైల్యే గ్రంధి శ్రీనివాస్ తో పాటు... ధర్మాన బ్రదర్స్‌ కూడా జనసేన వైపు చూస్తున్నారట. తోట త్రిమూర్తులు కూడా అదే దారిలో ఉన్నారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: