ఏపీ: పింఛన్ వ్యవహారంపై చంద్రబాబు సంచలన నిర్ణయం.. వారందరికీ కట్..!
రాష్ట్రవ్యాప్తంగా పింఛన్లలో ఎవరైనా అనర్హులు ఉంటే వెంటనే వారిని తొలగించాలని ఆదేశాలను కూడా జారీ చేశారు.. ఒకవేళ అధికారులు కనుక నిర్లక్ష్యం చేస్తే వారిపైన చర్యలు తీసుకుంటామంటూ తెలియజేశారు. అలా ఎవరైనా అనర్హులు పించిని తీసుకుంటే వారి నుంచి రెవెన్యూ రికవరీ చేయాలని వారి పైన కేసులు నమోదు చేయాలంటూ అధికారులను ఆదేశాలు జారీ చేశారట.. అలాగే దివ్యంగుల పింఛన్లకు సంబంధించి ఎన్నో తప్పులు జరిగాయని తెలుపుతున్నారు. కొంతమంది అర్హత లేకపోయినా కూడా పింఛన్లను తీసుకుంటున్నారని సదరం సర్టిఫికెట్ విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
అర్హత లేకపోయినా కొంతమంది డాక్టర్లు సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్లు మంత్రి అచ్చెమనాయుడు కూడా తెలియజేశారు. అలాంటి డాక్టర్ల పైన కూడా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలను జారీ చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పైలెట్ సర్వే నిర్వహిస్తారని ఇందులో నకిలీ పింఛన్లను గుర్తిస్తారని తెలిపారు. సుమారుగా రాష్ట్రవ్యాప్తంగా ఆరు లక్షల మంది అనర్హులకు పించిని ఇస్తున్నట్లుగా మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా వివరించారు. దీంతో మూడు నెలలలోనే అనర్హులను గుర్తించే ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు కలెక్టర్లను అన్ని జిల్లాలకు ఆదేశాలను జారీ చేశారు. ప్రతి సచివాలయంలో కూడా దివ్యాంగుల కోటా నుంచి పింఛన్ చాలామంది అనర్హులు పొందుతున్నట్లుగా గుర్తించారట అధికారులు. అయితే ఎవరైతే తల్లితండ్రులు మరణించి ఉంటారు వారికి పించన్ ఇవ్వాలని ఇటీవలే చంద్రబాబు సూచించారు.. వీటితోపాటు వితంతుల విభాగంలో కూడా చాలానే బోగస్ పింఛనీలు ఉన్నట్లుగా తెలిపారు. సుమారుగా 6 లక్షల మంది బోగస్ పింఛనీల వేరువేయబోతున్నారట.