నయనతారకు మరో భారీ దెబ్బ.. 100 కోట్లు బొక్క..ఈసారి ఎలా అంటే..?
అయితే చాలామంది ఈ విషయంలో ధనుష్ కే సపోర్ట్ చేయడం గమనారహం. ధనుష్ సినిమాని ప్రొడ్యూస్ చేశారు అని .. ఆ సినిమా కోసం ఆయన చాలా డబ్బులు ఖర్చు పెట్టాడు అని.. ఆ సినిమాలోని ఒక్క బిట్టు వాడుకోవాలన్నా కూడా ధనుష్ పర్మిషన్ ఉండాల్సిందేనని చెప్పుకొచ్చారు . అంతేకాదు గతంలో నువ్వు ,,నీ మొగుడు అలా చేయలేదా..? అంటూ పలువురు ఏకంగా నయనతార - విగ్నేష్ శివన్ లని అడిగి కడిగి పాడేశారు.
అయితే ఈ వ్యవహారం ఇంకా చల్లారకముందే నయనతారకు ఊహించని షాక్ ఎదురైన్నట్లు తెలుస్తుంది. కోలీవుడ్లో ఆమె కమిట్ అయిన సినిమాలు క్యాన్సిల్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . నయనతార లీడ్ పాత్రలో ఓకే చేసిన ఈ సినిమా ఓ రేంజ్ లో హిట్ అవుతుంది అంటూ ముందుగానే మేకర్స్ భావించారు . స్టోరీ అలాంటిది మరి. అందుకే ఎంత బడ్జెట్ అయినా పెట్టడానికి నిర్ణయించుకున్నారు మేకర్స్. కానీ ధనుష్ తో వైర్యం పెట్టుకున్న తరువాత..సీన్ మారిపోయింది.
నయనతార ఈ సినిమాలో నటిస్తే కచ్చితంగా జనాలు ఫ్లాప్ చేస్తారు అని నిర్మాతలు అడుక్కుతినాల్సిందేనని ..ఆ కారణంగానే నయనతారకు ఇష్టం లేకపోయినా కూడా ఈ సినిమాని క్యాన్సిల్ చేసేసారట. ఈ సినిమా హిట్ అయి ఉంటే ఆమెకు నెక్స్ట్ కచ్చితంగా బడాబడా ఆఫర్స్ వచ్చి ఉండేవి. తద్వారా ఒక 100 కోట్ల డబ్బులు అయినా సంపాదించుకునేది. నయనతార చేసిన చిన్న తప్పు ఇప్పుడు ఆమెకు 100 కోట్లు బొక్క పడేలా చేస్తుంది. తెలుగులో కూడా కొత్తగా సినిమాలకు కమిట్ అవ్వడం లేదు. ఆమెకు అవకాశాలు రావడం లేదు అంటున్నారు సినీ ప్రముఖులు . ఇప్పుడు కోలీవుడ్ లో కూడా అవకాశాలు రాకపోవడంతో నయనతార పరిస్థితి నెక్స్ట్ ఏంటి ..? అంటున్నారు జనాలు..!