శీతాకాలంలోనే గుండెపోటు ప్రమాదం ఎందుకు పెరుగుతుంది...? ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి!
అటువంటి పరిస్థితి, ఈ సీజన్లో హృదయాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. చలికాలంలో గుండె జబ్బులను ఎలా నివారించవచ్చు...? గుండెపోటు ప్రమాదం నుంచి బయటపడేందుకు నిపుణులు ఏం చెబుతున్నారు.. ఈ విషయాలను తెలుసుకోండి. చలికాలంలో చల్లటి గాలి పీచటం వల్ల కూడా గుండె సిరల్లో స్పాసమ్ ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది హృదయనాళ వ్యవస్థ మరింత ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది గుండెపోటుకు కారణం అవుతుంది. చలి వాతావరణం వల్ల రక్తపోటు పెరుగుతుందని గురుగ్రామ్ లోని పరాస్ హాస్పిటల్ కార్డియాలజీ విభాగం డాక్టర్, యూనిట్ హెడ్ డాక్టర్ అమిత్ భూషణ్ శర్మ చెప్పారు. ఈ సీజన్లో దీర్ఘకాలిక గుండె సమస్యలు కూడా పెరుగుతాయి.
అటువంటి పరిస్థితిలో, ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది. అకస్మాత్తుగా భారీ వ్యాయామాలు చేయవద్దు. బయట వ్యాయామం చేసే బదులు ఇంట్లోనే తేలికపాటి ఇండోర్ వ్యాయామాలు చేయండి. ఈ సీజన్ లో నీ ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించలేడి. ఆహారంలో సీజన్ ప్రకారం పండ్లు, ఆకు పచ్చ కూరగాయలను చేర్చండి. చాలా తీపి, ఫాస్ట్ ఫుడ్, డ్రై ఫుడ్ తినటం మానుకోండి. శీతాకాలంలో రక్తపోటును తనిఖీ చేయడం చాలా ముఖ్యం. బీపీ పెరిగితే వైద్యులను సంప్రదించాలి. మీకు ఇప్పటికే ఏదైనా గుండెజబ్బు ఉంటే, మీ మందులను సకాలంలో తీసుకోండి.