టమాటాలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే... ఇలా చేసి చూడండి!

lakhmi saranya
చాలామంది టమాటాలను ఇష్టంగా తింటారు. మరి కొంతమందికి మాత్రం టమాటాలు అంటే అస్సలు ఇష్టం ఉండదు. టమాటాలేని వంటలు ఊహించలేం. అందుకే ప్రతి వంటకాల్లోనూ వీటిని వాడేస్తుంటాం. ఇవి రుచికి కాదు ఆరోగ్యానికి కూడా మంచిది. అయితే ప్రస్తుతం టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అయితే వీటిని కొన్న కొన్నాళ్లకే పాడైపోతుంటాయి. అలాకాకుండా టమాట ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే.. ఈ విధంగా ట్రై చేయండి. అంతేకాకుండా ఈ టమాటాలను వంటల్లోనే కాకుండా సలాడ్స్, శాండివిచ్ లు, బర్గర్లు, పిజ్జాల తయారీలో కూడా విరివిగా ఉపయోగిస్తుంటారు.
కానీ వీటిని ఎక్కువ కాలం నిలువ చేయడం చాలా కష్టమైన పని. నిలువలో కాస్త తేడా వచ్చిన టమాటాలు త్వరగా పాడైపోతాయి. కాబట్టి టమాటాలను ఎక్కువ కాలం చెడిపోకుండా ఉండాలంటే ఈ కింద చిట్కాలు పాటిస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. టమాటాలను మార్కెట్ నుంచి తీసుకువచ్చిన తర్వాత వాటిని కడగడం, ఆ వెంటనే ఫ్రిజ్ లో పెట్టడం మానుకోవాలి. తడిగా ఉంటే, బాగా ఆరబెట్టి, ఆపై ఫ్రిజ్లో ఉంచడం మంచిది. ఇతర కూరగాయలతో టమాటోలు ఉంచకూడదు. కూరగాయల బరువు టమోటా మీద పడటంతో అవి పాడయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇతర పండ్లు,
 కూరగాయలతో కలిపి ఉంచితే కుళ్లిపోయే అవకాశం కూడా ఎక్కువ. టమోటాలను క్విజ్ లో ఉంచేటప్పుడు వాటిని పేపర్లో చుట్టడం మర్చిపోవద్దు. ఎలా ఉంచితే పొడిగా ఉండి ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. వంటకు ముందు పసుపు నీటిలో టమాటాలు కడగడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే మార్కెట్ నుంచి తెచ్చిన టమాటాను పసుపు నీళ్లలో కడిగి ఆరబెట్టాలి. ఇలా చేస్తే టమోటాలు తాజాగా ఉంటాయి. ప్లాస్టిక్ సంచుల్లో టమాటాలు నిల్వ చేయవద్దు. టమాటాలకు తేమ తగిలితే త్వరగా కుళ్ళిపోతాయి. కాబట్టి టమాటాలను ప్లాస్టిక్ బ్యాగులకు బదులు గాలి చొరబడని డబ్బాలు, బుట్టలో నిలవ ఉంచడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: