శీతాకాలంలో గర్భిణీలు ఖచ్చితంగా ఈ ఫుడ్స్ తినాల్సిందే..!

lakhmi saranya
ప్రెగ్నెన్సీ తో ఉన్నవారు శీతాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. శీతాకాలంలో మంచి ఆహారం తప్పకుండా తీసుకోవాలి. వింటర్ సీజన్ వచ్చిందంటే గర్భిణీలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కాలంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ సీజన్లో రోగ నిరోధక శక్తి అనేది బాగా తగ్గిపోతుంది. దీనివల్ల గర్భిణీలు బాగా అలసిపోతారు. అనేక వ్యాధులు కూడా చుట్టూ ముడతాయి. గర్భిణీలు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని రకాల ఆహారాలు కచ్చితంగా తీసుకోవాలి. వాటిల్లో బాదం, వాల్ నట్స్, కూడా ఒకటి.
వీటిల్లో విటమిన్ ఇ, మెగ్నీషియంలు మెండుగా లభిస్తాయి. ఇవి ఇమ్యూనిటీ పెంచడంలో హెల్ప్ చేస్తాయి. అలాగే విటమిన్ సి ఉండే ఫుడ్స్ అధికంగా తీసుకోవాలి. గర్భిణీలు ఈ సీజన్ లో ఆరోగ్యంగా ఉండాలంటే పాలకూర కూడా తీసుకుంటూ ఉండాలి. ఇతర కూరల కంటే పాలకూర తీసుకోవటం చాలా మంచిది. ఇందులో ఐరన్ శాతం, ఫోలేట్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. రక్త కణాల నిర్మాణంలో ఇది ఎంతో హెల్ప్ చేస్తుంది. ప్రెగ్నెంట్ లేడీస్ సాధారణంగానే చేపలు కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అందులోనూ చలికాలంలో తీసుకుంటే మరింత మంచిది.
చేపలు తినడం వల్ల శిశువు బ్రెయిన్ అనేది బాగా డెవలప్ అవుతుంది. అంతేకాకుండా శిశువు బ్రెయిన్ యాక్టివ్ గా పని చేస్తుంది. సాల్మన్, ట్యూనా వంటి చాపలు తింటే బెటర్. చలికాలంలో చిలకడ దుంపలు కూడా అనేకంగానే లభిస్తాయి. కాబట్టి వీటిని కూడా తింటూ ఉండాలి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా... శిశువు ఆరోగ్యంగా ఉండేందుకు హెల్ప్ చేస్తుంది. ఎక్కువ శాతం ఫోలెడ్, ఫైబర్ ఉంటాయి. ఇవి గర్భిణీలు కచ్చితంగా తీసుకోవాలి. కాబట్టి ప్రెగ్నెన్సీ తో ఉన్నవారు మంచి ఆహారాన్ని తీసుకోవటం మంచిది. ఇవి ఇమ్యూనిటీ పెంచడంలో హెల్ప్ చేస్తాయి. అలాగే విటమిన్ సి ఉండే ఫుడ్స్ అధికంగా తీసుకోవాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: