రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ దెబ్బ‌కు దద్ద‌రిల్లిన గూగుల్ ..!

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

టాలీవుడ్ సినిమా క్రేజ్ ను దేశం ఎల్లలు దాటించేసి .. ప్ర‌పంచ వ్యాప్తంగా చాటి చెప్పిన ఘ‌న‌త ఎవ‌రిది అంటే అది ఖ‌చ్చితంగా యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ దే అని చెప్పాలి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా వస్తుందంటే తెలుగులోనే కాకుండా యావత్ దేశ వ్యాప్తంగా ఎలాంటి ? క్రేజ్ నెలకొంటుందో అందరికీ తెలిసిందే. బాహుబ‌లి 1 - బాహుబ‌లి 2 రెండు సినిమా ల త‌ర్వాత వ‌చ్చిన సాహో వాస్త‌వానికి టాలీవుడ్ లో పెద్ద‌గా అంచ‌నాలు అందుకో లేదు. అయినా కూడా నార్త్ లో ఏకంగా రు. 150 కోట్లు కొల్ల‌గొట్టింది. ఇక స‌లార్ - క‌ల్కి రెండు సినిమా లు ప్ర‌భాస్ స్టామినా ఏంటో చాటి చెప్పాయి.

ఇక ఇప్పుడు ప్ర‌భాస్ ఓ సినిమా చేశాడంటే, అది ఖచ్చితంగా పాన్ ఇండియన్ మూవీగా రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అన్న‌ది రాసి పెట్టుకోవ‌చ్చు . ఇక ఇటీవల ప్రభాస్ వరుస సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తూ త‌న ద‌మ్మేంటో ఫ్రూవ్ చేసుకుంటున్నాడు. ఇక రీసెంట్ గా ప్ర‌భాస్  నటించిన లాస్ట్ మూవీ ‘ కల్కి 2898 ఎడి ’ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించి ప్ర‌భాస్ స్టామినా ఏంటో మ‌ళ్లీ దేశ వ్యాప్తంగా చాటి చెప్పింది.

ఇక 2024లో ప్రముఖ ఆన్‌లైన్ సెర్చ్ ఇంజిన్ ‘ గూగుల్ సెర్స్ ’ లో రెబల్ స్టార్ మేనియా ఒక‌ రేంజ్ లో కొనసాగింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన కూడా గూగుల్ వాళ్లు విడుదల చేశారు. 2024లో ప్రభాస్‌కి సంబంధించిన సినిమాల్లో ఎక్కువ మంది సెర్చ్ చేసింది సలార్, కల్కి చిత్రాలు అని గూగుల్ పేర్కొంది. దీంతో రెబ‌ల్ ఫ్యాన్స్ అయితే రెబల్ స్టార్ మేనియాకు గూగుల్ దద్దరిల్లిందని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ ది రాజా సాబ్, ఫౌజీ చిత్రాల షూటింగ్‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: